విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో పర్యటించిన ఎంపీ... వైరస్ బాధితులను పరామర్శించారు. మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. విజయరామరాజుపేటలో జ్వరాల సర్వే తీరును అడిగి తెలుసుకున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి అనుమానిత లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఇదీ చూదవండి..
కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై సోమవారం నుంచి శాస్త్రీయ పరిశీలన: ఆరోగ్య శాఖ