ఇటీవల వివిధ అంశాలపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను తాను వ్యక్తిగతంగా విభేదిస్తానని విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో సజావుగా సాగాల్సిన పనులకు అటంకం ఏర్పడుతోందన్నది తన అభిప్రాయమన్నారు. రాష్ట్రంలో తెదేపా నేతలు పూర్తిగా అసంబద్ధ వ్యాఖ్యలతో తప్పుదోవ పట్టించే పనిలో ఉన్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్పై ప్రజలు నమ్మకం ఉంచి గెలిపించిన రోజు ఇదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా పాలన సాగుతోందనీ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90 శాతం పైగా హామీలను అమలు చేశారు. సంక్షేమం, అభివృధ్ది దిశగా జగన్ పాలన నడుస్తోందని చెప్పారు.
ఇదీ చదవండి: