విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం కొత్త లక్ష్మీపురం రోడ్డు మార్గంలోని వ్యవసాయ బావిలో గుర్తు తెలియని మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. నీళ్ల కోసం బావి వద్దకు వెళ్లిన కొంతమంది మహిళలు.. నీటిలో తేలుతూ ఉన్న మృతదేహాన్ని గుర్తించి స్థానికులకు సమాచారం ఇచ్చారు. అనంతరం గ్రామస్థులు శవాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న నర్సీపట్నం రూరల్ ఎస్సై రమేష్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వ్యవసాయ బావిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - విశాఖపట్నం తాజా సమాచారం
విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం కొత్త లక్ష్మీపురంలోని వ్యవసాయ బావిలో గుర్తు తెలియని మృతదేహం తీవ్ర కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.