ETV Bharat / state

'అరుణను న్యాయస్థానంలో హాజరుపరచండి' - Maoists

మావోయిస్టు అగ్రనేత అరుణను న్యాయస్థానంలో హాజరుపరచాలని అమరవీరుల బంధుమిత్రులు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గత మూడు రోజులుగా విశాఖ ఏజెన్సీలో జరుగుతున్న ఎన్​కౌంటర్ల నేపథ్యంలో బంధుమిత్రుల సంఘం విశాఖ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

'అరుణను న్యాయస్థానంలో హజరు పరచండి'
author img

By

Published : Sep 24, 2019, 5:49 PM IST

'అరుణను న్యాయస్థానంలో హజరు పరచండి'

విశాఖ ఏజెన్సీలో ఈనెల 22న ఎన్​కౌంటర్​పై అనేక అనుమానాలు ఉన్నాయని అమరవీరుల బంధుమిత్రుల సంఘం అరోపించింది. మొదట ఐదుగురు మావోయిస్టులు మరణించారని.. ఆ తర్వాత ముగ్గురు అని వార్తలు వచ్చాయని సంఘం అధ్యక్షురాలు అంజమ్మ విశాఖ​లోని మీడియా సమావేశంలో తెలిపారు. ఆ తర్వాత మృతులు ఇద్దరే అని.. వారిలో మావోయిస్టు అగ్రనేత అరుణ ఉందని వార్తలు వచ్చాయన్నారు. అసలు ఎంతమంది చనిపోయారో అనుమానరీతిలో ప్రకటనలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల దేహాలపై గాయాలు ఉన్నాయని.. భారీ వర్షం కురిసినా వారి శరీరాలపై ఏ మాత్రం బురద లేకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని... అనంతరం చంపారనే అనుమానం ఉందన్నారు. ఏవోబిలో జరుగుతున్న ఆపరేషన్ ఆర్కేను నిలిపివేసి ఆదివాసులపై జరుగుతున్న హింసాకాండను ఆపివేయాలని ఆమె డిమాండ్ చేశారు.

అరుణ తండ్రి లక్ష్మణ్ రావు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా టీవీలో వస్తున్న వార్తలు తమలో ఆవేదనను, అనుమానాలను రేకెత్తిస్తున్నాయన్నారు. తన కూతురు మృతి చెందిందో, లేదో తెలియడం లేదని... ఇప్పటికైనా ప్రభుత్వం మృతి చెందిన వారి పేర్లను ప్రకటించాలని కోరారు. అదుపులో ఉన్న వారిని న్యాయస్థానం ముందు హాజరు పరచాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఇది చదవండి:

'కార్మికుల సంక్షేమం కోసం రూ.24 ఇవ్వలేరా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.