ETV Bharat / state

మన్యం వీరుడు అల్లూరి జీవితం ఆదర్శం - collector vinay chand

విశాఖ జిల్లా పద్మనాభ మండలం పాండ్రంగిలో అల్లూరి 122వ జయంతి వేడుకలు జరిగాయి. పర్యాటక శాఖ మంత్రి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మన్యం వీరుడు అల్లూరి జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడారు.

పాండ్రంగిలో అల్లూరి జయంతి ఉత్సవాలు
author img

By

Published : Jul 4, 2019, 11:17 PM IST

విశాఖ జిల్లా పద్మనాభ మండలం పాండ్రంగిలో అల్లూరి సీతారామరాజు 122వ జయంతి వేడుకలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గిరిజన సంప్రదాయ నృత్యాలతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. కొమ్ముకోయ, థింసా, తప్పుడు గుళ్ళు కోలాటం, డప్పు వాయిద్యాలు నడుమ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పర్యాటక శాఖ ఈ ఉత్సవాలకు 10 లక్షలు ప్రకటించింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గ్రామానికి మౌలిక వసతుల కల్పనకు రెండు కోట్లు ప్రకటించిందని మరికొద్ది రోజుల్లో పనులు ప్రారంభిస్తామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

సభకు అల్లూరి వారసుల హాజరు...
సభలో అల్లూరి వారసులను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు. జయంతి వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం తమకెంతో ఆనందం కలిగిస్తోందని అల్లూరి వారసులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మమ్మల్ని గుర్తు పెట్టుకొని మంత్రి అవంతి మా తాత గారు పుట్టిన స్థలంలో అడుగు పెట్టించడం ఆనందంగా ఉందని వారు తెలిపారు.

ప్లకార్డులతో ప్రదర్శన...
విద్యార్థి దశ నుంచే ఎస్ఎఫ్ఐలో చురుగ్గా సేవలందించానని... కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొని నక్సలైట్​గా వెళదామనుకొని ప్రజా జీవితంలోకి వచ్చి సేవలందిస్తున్నానని మంత్రి తెలిపారు. ఓ ప్రైవేట్ పరిశ్రమ కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ మహిళలు ప్లకార్డులను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మంత్రి ఘాటుగా స్పందించారు. దీనికి సంబంధించి కలెక్టర్ వినయ్ చంద్ సంబంధిత మహిళలకు పరిశ్రమ కాలుష్యంపై వివరణ ఇచ్చారు.

పాండ్రంగిలో అల్లూరి జయంతి ఉత్సవాలు

ఇదీ చదవండీ... ఆర్​ఆర్​ఆర్​ షూటింగ్​కు బ్రేక్.. ఎందుకంటే ?

New Delhi, July 04 (ANI): Bollywood actor Hrithik Roshan's latest social media post is dedicated to the people who 'shape the future of the society'- teachers. The Bollywood actor, who will be seen, playing a teacher in his upcoming film 'Super 30', shared a thank you note for all the teachers out there. Directed by Vikas Bahl, the upcoming biopic is one of the highly anticipated films of 2019. The film chronicles the life story of Anand Kumar (Hrithik), an Indian mathematician who quit his job as a teacher in a top coaching center attended by rich students, to dedicate his time into teaching underprivileged children. The film will hit the theatres on July 12, this year.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.