ETV Bharat / state

విశాఖలో డేటా సెంటర్​కు భూమి కేటాయింపు - ఎకరాకు కోటి

Allotment of Land for Datacenter in Visakha Kapuluppada: విశాఖలోని భీముని పట్నం మండలం కాపులుప్పాడలో 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు మెస్సర్స్ వైజాగ్ టెక్ పార్కు లిమిటెడ్ కేటాయించిన భూములను మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటీపీఎల్​కు కేటాయించిన 60 ఎకరాల భూమి ధరను ఎకరాకు కోటి రూపాయలు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 10:49 PM IST

Allotment of Land for Datacenter
Allotment of Land for Datacenter

Allotment of Land for Datacenter in Visakha Kapuluppada: విశాఖలోని కాపులుప్పాడలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి భూ కేటాయింపులో మార్పు చేర్పులతో పాటు, భూమి ధరను నిర్ధారిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డేటా సెంటర్, ఐటీ బిజినెస్ పార్కులు, రిక్రియేషన్ సెంటర్ల ఏర్పాటు కోసం మెస్సర్స్ వైజాగ్ టెక్ పార్కు లిమిటెడ్ కు కేటాయించిన సర్వే నెంబర్లు మార్పు చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Expert Committee Report on Rushikonda: రుషికొండ నిర్మాణాలపై నివేదిక సమర్పించిన కమిటీ... హైకోర్టు కీలక ఆదేశాలు

వీటీపీఎల్ కు కేటాయించిన 60 ఎకరాల భూమి ధరను ఎకరాకు కోటి రూపాయల చొప్పున కేటాయించేందుకు ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఆ భూమి ధరను నిర్ధారిస్తూ... వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలోని భీముని పట్నం మండలం కాపులుప్పాడలో 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు మెస్సర్స్ వైజాగ్ టెక్ పార్కు లిమిటెడ్ ముందుకు వచ్చింది. గతంలో కేటాయించిన 401/1 సర్వే నెంబరుకు బదులుగా 404/1 సర్వే నెంబరులో భూమిని కేటాయిస్తూ ప్రస్తుత ఉత్తర్వులు విడుదల చేశారు. ఎకరా భూమిని కోటి రూపాయల చొప్పున కేటాయించేందుకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాపులుప్పాడలో వంద మెగావాట్ల డేటా సెంటర్, ఐటీ, బిజినెస్ పార్కు, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్ల ఏర్పాటు కోసం వైజాగ్ టెక్ పార్కు లిమిటెడ్ కు ప్రభుత్వం గతంలో 60.29 ఎకరాలు కేటాయించింది. తాజాగా... సర్వే నెంబరు 401/1, 414/1,421/1లో 52.28 ఎకరాలను, సర్వే నెంబరు 405/1లో 8.01 ఎకరాలను వైజాగ్ టెక్ పార్కు లిమిటెడ్ కు కేటాయింపులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఫిషింగ్ హార్బర్‌ ప్రమాదంపై విచారణకు ఆదేశించిన సీఎం - మత్స్యకార్మికులను ఆదుకోవాలన్న లోకేశ్

వైసీపీ అధికారంలోకి వచ్చింది మెుదలూ... విశాఖలో అత్యంత విలువైన భూముల్ని అవకాశం ఉన్న చోటల్లా అధికార పార్టీ ముఖ్య నేతలు, వారి బినామీలు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ విధ్వంసక విధానాలతో ఇప్పటికే HSBC వంటి ఐటీ సంస్థలు విశాఖను వదిలి వెళ్లిపోగా.. మరికొన్ని సంస్థల్ని ప్రభుత్వమే వెళ్లగొట్టే ప్రయత్నాలు చేసింది. తాజాగా కొద్దోగొప్పో ఐటీ సంస్థలు ఉన్నాయనుకుంటే... ప్రభుత్వ శాఖల పేరుతో ఐటీ సంస్థలను తరిమే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగా విశాఖలో ఐటీ రంగం అభివృద్ధిని ప్రోత్సహించేందుకు నిర్మించిన మిలీనియం టవర్స్‌లో చాలా భాగాన్ని.. రాజధానిని అక్కడికి తరలించే దురుద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం ఇన్నేళ్లూ ఖాళీగా పెట్టింది. దానిని ఇప్పుడు తమ సమీక్షలకు ఉపయోగించుకునేందుకు వాటి వాడుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల్ని కల్పించే లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో.. మిలీనియం టవర్స్‌ నిర్మాణం తలపెట్టారు. ఇలా వచ్చిన సంస్థలపై వేధింపులు... లాంటి ఘటనలతో ఐటీ సంస్థలు రాష్ట్రంలోకి రావాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయంటూ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు.

'మేం విశాఖకు రాలేం!' సీఎస్​తో తేల్చేసిన సీనియర్ ఐఏఎస్​లు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.