ETV Bharat / state

వ్యాక్సినేషన్​కు సర్వం సిద్ధం - కొవిడ్ టీకా వేసేందుకు విశాఖ జిల్లా సిద్ధం

రేపటి నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండగా.. విశాఖ జిల్లాలో 32 కేంద్రాలు అందుకు సిద్ధమయ్యాయి. టీకా వేసేందుకు చేసిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు పరిశీలించారు. చినవాల్తేర్​లోని ఆరోగ్య కేంద్రంలో అధికారికంగా ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు.

covid vaccination arrangements completed in visakha
కొవిడ్ వ్యాక్సినేషన్​కు విశాఖ జిల్లా సిద్ధం
author img

By

Published : Jan 15, 2021, 6:14 PM IST

విశాఖ జిల్లాలోని 32 వైద్య కేంద్రాల్లో కొవిడ్ వాక్సిన్ వేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి విడ‌త‌లో ఆరోగ్య కార్యకర్తలకు టీకా అందించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ ప్రక్రియ జరిపే విధంగా సిద్ధం చేశారు. మొత్తం 15 నియోజకవర్గాలకు గాను.. 32 చోట్ల వ్యాక్సిన్ అందుబాటులో ఉంచినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

విశాఖ చినవాల్తేర్​లోని ఆరోగ్య కేంద్రంలో రేపు అధికారికంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. టీకా వేయించుకునే వారు ఖచ్చితంగా 45 నిమిషాలు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని అధికారులు సూచించారు. వాక్సిన్ కేంద్రాలు, ఆరోగ్య స‌మ‌స్య‌లు ఏమైనా వ‌స్తే ప‌ర్య‌వేక్షించేందుకు నిపుణులను సిద్దంగా ఉంచే అంశాల‌ను.. ఆంధ్ర వైద్య క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ పీవీ సుధాక‌ర్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్ట‌ర్ సూర్య‌నారాయ‌ణ ప‌రిశీలించారు.

ఇదీ చదవండి:

కనుమ సందర్భంగా విశాఖ శారదాపీఠంలో గోపూజ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.