ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో అఖిల భారత యువజన సమాఖ్య నిరసన ర్యాలీ చేపట్టింది. డాబాగార్డెన్స్ సరస్వతి పార్క్ కూడలి వద్ద నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ వలన లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
ఇవీ చదవండి: పూడిన పంట కాలువలు.. మరమ్మతులు చేసిన రైతులు