కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐటీయూసీ, సీఐటీయూ సంయుక్తగా విశాఖ మద్దిలపాలెం కూడలిలో నిరసన చేపట్టారు. భాజపా అధికారంలోకి వచ్చాక అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోయాయని ఆరోపించారు. లాక్డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకు 10 వేల రూపాయలు మూడు నెలలపాటు చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. కార్మికులు పోరాడి సాధించిన చట్టాల సవరణను కేంద్రం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు అజశర్మ , ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వామన మూర్తి, జిల్లా సమితి సభ్యులు గోవింద్, మధు రెడ్డి, సి.వి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: 'చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు'