ETV Bharat / state

కేంద్రం నిర్ణయంతో... వ్యవసాయ మార్కెట్లకు కష్టాలు - agricultural market committees update

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వ్యవసాయ మార్కెట్ కమిటీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. కొన్ని నెలలుగా ఆదాయం నిలిచిపోవటంతో... సిబ్బందికి ఉన్న నిధుల నుంచే జీతాలు చెల్లిస్తున్నారు. ఇదే కొనసాగితే మార్కెట్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

amc struggles
వ్యవసాయ మార్కెట్
author img

By

Published : Dec 31, 2020, 12:50 PM IST

అన్నదాతలకు అండగా నిలిచే మార్కెట్ కమిటీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంట ఉత్పత్తులపై పన్ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో... మార్కెట్ యార్డులు కోట్ల ఆదాయన్ని కోల్పోవాల్సి వచ్చింది. నాలుగు నెలలుగా పైసా ఆదాయం లేక... ఉన్న నిధుల నుంచి ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా మార్కెట్ కమిటీల ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. నిధుల కొరత ప్రభావం రైతు సంబంధిత సేవలపైన పడుతోంది.

1966లో ప్రారంభం...

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని.. 1966లో మార్కెట్ యార్డులకు శ్రీకారం చుట్టారు. గోదాములు నిర్మించి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. నిల్వ చేసిన పంటలపై వడ్డీ రాయితీ రుణాలను సైతం అందజేసేవారు. ఉత్పత్తులపై పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని తిరిగి రైతు సంక్షేమానికే ఖర్చు చేసేవారు. యార్డుల్లో పని చేసే ఉద్యోగుల జీతాలు, రైతుబంధు పథకం, ఉచిత పశువైద్య శిబిరాలు, పొలాలకు వెళ్లేందుకు రహదారులు వంటి కార్యక్రమాలు చేపట్టేవారు. ఈ విధమైన సేవలు అందించే వ్యవసాయ మార్కెట్ కమిటీలు నేడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మార్కెట్​లకు రావాల్సిన పన్నులను రద్దు కావటంతో పూర్తిగా కుదేలు అయ్యాయి.

విశాఖ జిల్లాలో కొత్తవాటితో కలిపి మెుత్తం 12 మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి సుమారు 15.89 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. జూన్ నెల వరకు 3.35 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత పంట ఉత్పత్తులపై పన్ను రద్దు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయటంతో... రాబడి మెుత్తం పడిపోయింది. ఆదాయం లేక ఉద్యోగుల జీతాల కోసం ఉన్న నిధులు వెచ్చించాల్సి వస్తోంది.

జిల్లాలలో ఏఎంసీలలో పని చేసే ఉద్యోగాల్లో 80 శాతం ఖాళీగా ఉండటంతో... ప్రస్తుతానికి జీతాలు చెల్లించే సమస్య రాలేదు. ప్రభుత్వం దయతలచి యార్డులు నిర్వహించటానికి అవకాశం కల్పిస్తే మార్కెట్ మళ్లీ కళకళలాడుతుంది. లేకపోతే వ్యవసాయ మార్కెట్​లన్నీ నిర్వీర్యం అయిపోతాయని సిబ్బంది వాపోతున్నారు.

ఇదీ చదవండి:

పెంపుడు జంతువులకు ఇక లైసెన్స్ తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.