ETV Bharat / state

మత్స్యకారులతో విశాఖ సముద్ర తీరం కళకళ... - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

చేపల వేట నిషేధకాలం ముగియటడంతో విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్న సముద్రతీరం మత్స్యకారులతో కళకళలాడుతోంది. అలాగే, జట్టీలకే పరిమితమైన చేపల వేలం భీమిలికి కూడా విస్తరించంతో, భోజన ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

after lockdown fishing restart at visakha beach
మత్స్యకారులతో కలకలలాడుతోన్న విశాఖ సముద్ర తీరం
author img

By

Published : Jun 12, 2020, 11:53 AM IST

విశాఖ పట్నం జిల్లాలోని భీముని పట్న సముద్ర తీరం మత్య్సకారులతో కళకళలాడుతోంది. వేట నిషేధకాలం ముగియడంతో మత్స్యకారులు చేపల వేట ప్రారంభించారు. తోటవీధి, ఎగువపేట, బోయివీధి ప్రాంతాల్లో సుమారు వంద ఇంజన్​ బోట్లు, 3 చొప్పున వేటకు వెళ్లే నలభై తెరచాప బోట్లు ఉన్నాయి.

ఇక్కడ విశేషమేమిటంటే...జట్టికే పరిమితమైన చేపల వేలం పాట, భీమీలికి కూడా విస్తరించింది. లాక్​డౌన్​ కారణంగా ఏ ప్రాంత మత్స్యకారులు ఆ ప్రాంతంలోనే ఉండడంతో, ఇంజన్​ బోట్ల ద్వారా వలలకు చిక్కిన చేపలను వేలం వేస్తున్నారు. ఇలా చేపల వేలం ద్వారా వచ్చే ఆదాయంతో కొంతమంది జీవనం సాగిస్తున్నారు. ఒక్కో ఇంజన్​లో సుమారు 5 నుంచి 6 మంది మత్స్యకారులు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వెళ్లి 8గంటలకు ఒడ్డుకు చేరుతారు. ఈ విధంగా జట్టీలకే పరిమితమైన చేపల వేలం పాట ఇప్పుడు భీమిలిలో కూడా నిర్వహిస్తుండడంతో భోజన ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:నేటి ప్రధానవార్తలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.