ఇందులో అదనంగా కొవిడ్ బాధితుని ఉష్టోగ్రత కూడా చూసేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి 360 డిగ్రీల కెమెరాను అమర్చడం ద్వారా కొవిడ్ బాధితుని పరిస్ధితిని చాలా దగ్గరగా అంచనా వేయడానికి, వైద్యుడు నేరుగా సంభాషించడానికి అనువుగా ఉంటుందని తెలిపారు. మరోవైపు ఈ మెడి రోబోను మొబైల్ నుంచి రిమోట్ లో ఆపరేట్ చేసేందుకు వీలవుతుందని తెలిపారు. ఈ రోబోలో మరో కొత్త ఫీచర్ కూడా అందుబాటులో ఉంచారు. నర్సింగ్ స్టాఫ్, కోవిడ్ వార్డుల్లో సేవలందించే సిబ్బంది తమ వస్తు సామగ్రిని యూవి లైట్ ద్వారా స్టెరిలైజేషన్ చేసేందుకు ప్రత్యేకంగా ఛాంబర్లు ఏర్పాటు చేశారు.
కొవిడ్ వార్డులో వినియోగించేందుకు వీలుగా చీఫ్ మెకానికల్ ఇంజనీర్ గీతం దత్తా ఆదేశాలతో సిద్దం చేసినట్టు వివరించారు. గతంలో రూపొందించిన రోబోకు రైల్వే మంత్రి పియూష్ గోయెల్ నుంచి ప్రశంసలు లభించినట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి...