విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం పనసపుట్టు సమీపంలో జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో.. ఒకరు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. పెదబయలు మండలం గడుగుపల్లికి చెందిన 20 మంది గ్రామస్థులు ఓ జీపులో ఒడిశాలోని కెందుగుడ దేవాలయానికి వెళ్తుండగా.. పనసపుట్టు ఘాట్ రోడ్డు మలుపు వద్ద అదుపు తప్పి జీపు బోల్తా పడింది.
మృతురాలిని కొర్రా సీతగా గుర్తించారు. క్షతగాత్రులను ముంచింగిపుట్టు ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయమైన చిన్నారిని మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి పంపించారు. బాధితులు పెదబయలు మండలం గడుగుపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: