ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి - agency

విశాఖ జిల్లా చింతపల్లి వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ హోంగార్డు ప్రాణాలు కోల్పోయాడు.

రోడ్డుప్రమాదం
author img

By

Published : Aug 25, 2019, 12:43 AM IST

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి

విశాఖ నగర పరిధిలో గోపాలపట్నానికి చెందిన మొయ్య నారాయణరావు అనే హోంగార్డు చింతపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించాడు. హోంగార్డు సీలేరులో ఏపీ జెన్‌కోలో డిప్యుటేషన్‌పై ఏడాది పాటు పనిచేసిన అనంతరం అనకాపల్లి ఆర్‌టీఏ కార్యాలయానికి బదిలీపై వెళ్లాడు. తాజాగా మరలా సీలేరు ఏపీ జెన్‌కోకు వెళ్లమని ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ఆదేశాలు రావడంతో శనివారం విధుల్లో చేరడానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. చింతపల్లి వద్దకు వచ్చేసరికి పాదాచారులను తప్పించబోయి ఎదురుగా వస్తున్న 108 వాహనంను ఢీకొని కింద పడిపోయాడు. నారాయణరావు మీద నుంచి వాహనం వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహానికి పంచనామా చేసి స్వగ్రామానికి తరలిస్తున్నారు.

ఇది కూడా చదవండి.

అక్టోబరు 1 నుంచి 'విమాన సర్వీసులు రద్దు': ఎయిర్ ఏసియా

Intro:AP_VSP_56_24_ACCIDENT AT CHINTAPALLI_AV_AP10153Body:విశాఖ జిల్లా చింతపల్లి వద్ద శనివారం సాయంత్రం జరిగిన రహదారి ప్రమాదంలో హోంగార్డు ఒకరు మృతిచెందారు. విశాఖ నగర పరిధిలో గోపాలపట్నంకు చెందిన మొయ్య నారాయణరావు(32) హోంగార్డుగా పనిచేస్తున్నాడు. సీలేరులో ఏపీ జెన్‌కోలో డిప్యుటేషన్‌పై ఏడాది పాటు పనిచేసిన అనంతరం అనకాపల్లి ఆర్‌టీఏ కార్యాలయంకు బదిలీపై వెళ్లాడు. తాజాగా మరలా సీలేరు ఏపీ జెన్‌కోకు వెళ్లమని ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ఆదేశాలు రావడంతో శనివారం విధుల్లో చేరడానికి సీలేరు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. చింతపల్లి వద్దకు వచ్చేసరికి పాదాచారులను తప్పించబోయి ఎదురుగా వస్తున్న 108 వాహనంను ఢీకొని పడిపోవడంతో నారాయణరావు మీద నుంచి వాహనం వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు భార్య నావల్‌ డాక్‌యార్డ్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహానికి చింతపల్లి ఆసుపత్రిలో పోస్టుమార్టమ్‌ నిర్వహించి స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. Conclusion:M RAMANARAO, SILERU.AP10153
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.