విశాఖలో నివాసముంటున్న పంచాయతీ కార్యదర్శి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రంగస్థలంలో గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆగూరు వెంకట్రావు.. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై దాడులు చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో.. విశాఖ నగరంలోని రామ టాకీస్‌లో గల వెంకట్రావు నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. రూ.38 లక్షల నగదు, అరకిలో బంగారం, వెండి వస్తువులు, కోట్ల విలువ చేసే ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆస్తి విలువ తెలుసుకునేందుకు సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి:
ప్రభుత్వ పరిశ్రమల ప్రైవేటీకరణకు వైకాపా వ్యతిరేకం: విజయసాయిరెడ్డి