ప్రేమికుల రోజు వద్దు... జవాన్లే ముద్దు అంటూ.. విశాఖలో అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గతేడాది ఫిబ్రవరి 14న పుల్వామా దాడి ఘటనలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు సలాం అని నినాదాలు చేస్తూ... మద్దిలపాలెం కూడలిలో ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రేమికుల రోజుని త్యజిద్దాం.. దేశ రక్షణకు ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు నివాళులు అర్పిద్దాం అంటూ అందరికీ అవగాహన కల్పించారు.
ఇదీ చదవండి: క్యాన్సర్ ఆసుపత్రిలో చిన్నారులకు చిత్రలేఖనం పోటీలు