ETV Bharat / state

నాసా బ్రేక్ ది ఐస్ ఛాలెంజ్​లో తెలుగుయువకుల సత్తా...

ఈ ఏడాది అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా నిర్వహించిన ప్రతిష్టాత్మక బ్రేక్ ది ఐస్ ఛాలెంజ్- సెంటినియల్ సిరీస్‌ పోటీలో ముగ్గురు తెలుగుయువకులు సత్తా చాటారు. తమ పరిశోధనతో నాసా ప్రశంసలు అందుకున్నారు.

author img

By

Published : Sep 5, 2021, 7:42 PM IST

నాసా బ్రేక్ ది ఐస్ ఛాలెంజ్ లో తెలుగుయువకుల సత్తా.
నాసా బ్రేక్ ది ఐస్ ఛాలెంజ్ లో తెలుగుయువకుల సత్తా
నాసా బ్రేక్ ది ఐస్ ఛాలెంజ్ లో తెలుగుయువకుల సత్తా.

చంద్రుడి దక్షిణధృవం దగ్గర ఉన్న మంచు సేకరించి, భూమి పైకి తీసుకురావాలంటే మీరెలాంటి సాంకేతికత వినియోగిస్తారు? అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా నిర్వహించిన పోటీలోని అంశం ఇది. దీనిపై అంతర్జాతీయంగా వందలమంది నిపుణులు ఆలోచనలు పంచుకోగా.. ముగ్గురు తెలుగుకుర్రాళ్లు సైతం ఈ పోటీలో పాల్గొని సత్తా చాటారు. తమ ప్రాజెక్టు ద్వారా తొలి పదిస్థానాల్లో చోటు సంపాదించి.... రెండేళ్లపాటు నాసాలో పనిచేసే అవకాశం ఒడిసి పట్టారు.

అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా ఏటా వివిధ అంశాలపై పోటీలు నిర్వహిస్తుంటుంది. అలా.. ఈ ఏడాది నిర్వహించిన ప్రతిష్టాత్మక బ్రేక్ ది ఐస్ ఛాలెంజ్- సెంటినియల్ సిరీస్‌లో సత్తా చాటారు ముగ్గురు తెలుగుయువకులు. తమ పరిశోధనతో నాసా ప్రశంసలు అందుకున్నారు.

చంద్రుని దక్షిణధృవం దగ్గరి ఐసీ రిగోలిత్‌ ప్రాంతంలో.. నీటి జాడ కనిపెట్టి, వెలికి తీసే లూనార్ వాహనం రూపొందించాలని సవాల్‌ విసిరింది నానా. 48 దేశాల నుంచి 374 బృందాలు పోటీ పడగా.. అమెరికా వాషింగ్‌టన్‌కు చెందిన ప్రణవ్ ప్రసాద్, తెనాలికి చెందిన చుండూరు అమరేశ్వర ప్రసాద్‌, విశాఖకు చెందిన కరణం సాయి అశిష్ కుమార్‌ బృందం రూపొందించిన ప్రాజెక్టు నాసా శాస్త్రవేత్తలు ప్రశంసలు అందుకుంది..

ఏఏ-స్టార్‌ పేరుతో పోటీలో పాల్గొన్న ఈ ముగ్గురు యువకులు.. నాసా కోరినట్లు చంద్రుడిపై డ్రిల్లింగ్ చేయడమే కాదు.. అక్కడి పాక్షికంగా మంచును నీరుగా మార్చేలా లూనార్‌ వాహనాన్ని రూపొందించారు. ఈ జోడింపు పోటీల నిర్వాహకులను ఆకట్టుకుందని చెబుతున్నారు. ఈ కారణం గా తీవ్ర పోటీ మధ్య తొలి 3 స్థానాలు పోగా.. మిగిలిన 10 స్థానాల్లో చోటు సంపాదించుకున్నారు. ప్రోత్సాహకంగా.. 25 వేల డాలర్ల బహుమతి గెలుపొందారు.

"గత ఏడాది నవంబర్ లో ఈ ఛాలెంజ్ పై మా బృందం పని చేయడం ప్రారంభించాం. నాసా వాళ్లు అడిగింది చంద్రుని ఉపరితలంపై డ్రిల్లింగ్ చేసి మట్టిలో ఉన్న ఐస్ ని తీసి ఇచ్చే మోడల్ ని రూపొందించమన్నారు. మేం దానికి మరింత అదనపు హంగులు జత చేసి మేం రూపకల్పన చేసిన వాహనంలోనే పాక్షికంగా ఐస్ నుంచి నీటిని తయారు చేయడం కూడా పొందుపర్చాం. డ్రిల్లింగ్ చేసే నిర్దేశిత ప్రాంతం నుంచి ఈ వాహనం చేరాల్సిన చోటుకి వెళ్లేలోగానే నీరు తయారు అయ్యేట్టుగా రూపొందించాం. గతంలో నూ బృంద సభ్యునిగా ట్రావెలింగ్ సిస్టమ్ ను లూనా డెలివరీ ఛాలెంజ్ లో భాగంగా రూపొందించాం. అప్పుడు రెండు వేల డాలర్ల బహుమతి వచ్చింది. ఇప్పుడు ఈ సెంటినియల్ ఛాలెంజ్ లో పాల్గొన్న మా బృందానికి ఈ రకంగా మొదటి మూడు స్దానాల తర్వాత పది స్ధానాలలో చోటు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది."

-ఆశిష్ కుమార్, బృంద సభ్యుడు

ఈ బృందానికి ప్రణవ్‌ సారథ్యం వహించగా.. మిగతా సభ్యులు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. గతేడాది... నిర్వహించిన లూనార్ ఛాలెంజ్‌ పోటీల్లో సాయి అశిష్, అమరేశ్వర ప్రసాద్‌లు .. మరో సాంకేతిక నిపుణుడు కలిసి పాల్గొన్నారు. అప్పుడు 3వ స్థానంలో నిలిచి... 2 వేల డాలర్ల బహుమతి సొంతం చేసుకున్నారు. అది ప్రాథమిక స్థాయి పోటీ కాగా.. ప్రస్తుత పోటీ ప్రధానమైంది అంటున్నారు ఈ యువకులు.

ఈ బృందంలో టీం లీడర్ గా ఉన్న ప్రణవ్.. అమెరికాలో బీటెక్‌ కంప్యూటర్స్ పూర్తి చేశాడు. సాయి ఆశిష్ AU నుంచి M-TECH పూర్తిచేసి ఓ స్టార్టప్‌ నిర్వహిస్తున్నాడు. అమరేశ్వర ప్రసాద్ బెల్జియంలో.. ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. సాంకేతిక అంశాలపై మంచి పట్టు ఉన్న ఈ యువబృందానికి.. తమ ప్రాజెక్టుకు వాస్తవ రూపం ఇచ్చేందుకు నాసాతో కలిసి రెండేళ్లు పనిచేసే అవకాశం లభించింది.

ఎన్నో సాంకేతిక అడ్డంకులు అధిగమించి.. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలో పనిచేసే అవకాశం దక్కించుకున్న ఈ యువకులు. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే యువ ఇంజినీర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదీ చదవండి: NASA Flying Taxis: గంటకు 320 కి.మీ వేగంతో ఎగిరే ట్యాక్సీలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.