విశాఖలోని బొడ్డేరు నదిలో గల్లంతైన ఓ యువకుడు 21 రోజుల తర్వాత పెద్దేరు నదిలో తేలాడు. చీడికాడ మండలం దండిసురవరం గ్రామ యువకుడు బొబ్బాది పరమేశ్వరరావు అక్టోబరు 11న కాలు జారి ప్రమాదవశాత్తు బొడ్డేరు నదిలో పడ్డాడు. గాలింపు చర్యలు చేపట్టినా శవం దొరక్కపోవడంతో కుటుంబసభ్యులు ఆవేదన చెందారు. కలెక్టర్ ఆదేశాలతో ఎన్.డి.ఎఫ్ బృందాలు బొడ్డేరు, పెద్దేరు నదులలో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది.
చివరికి చోడవరం మండలం గౌరీపట్నం వద్ద పెద్దేరులో పరమేశ్వరరావు మృతదేహం కనిపించింది. నదిలో ఇసుక తవ్వేందుకు వెళ్లిన ఓ ఎడ్ల బండికి మృతదేహం అంటుకుని వేలాడింది. బండి యాజమాని పరిశీలించగా.. కుళ్లిన మృతదేహం కనిపించింది. బండి వదిలి ఎడ్లను విప్పుకుని గ్రామంలోకి వెళ్లిన అతను.. మృతదేహం గురించి పోలీసులకు చెప్పాడు. కుటుబసభ్యులు గౌరీపట్నం వచ్చి చూసి పరమేశ్వరరావుగా గుర్తించారు. చోడవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: