ETV Bharat / state

పాఠాలు బోధించేందుకు కొండలు దాటుతున్నాడు

ఆ గ్రామానికి చేరుకోవాలంటే 20 కిలోమీటర్లు కాలినడకన కొండలు, వాగులు దాటుకుని వెళ్లాలి. అక్కడి వారంతా ఏపీకి చెందిన వారే అయినప్పటికీ కొండ బాష తప్ప తెలుగు రాదు. ఇలాంటి ప్రాంతంలో ఉద్యోగం చేయడానికి ఏ ఉపాధ్యాయుడైనా వెనకడుగు వేస్తారు. కానీ ఓ యువ ఉపాధ్యాయుడు మాత్రం కష్టాలను ఓర్చి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు శ్రమిస్తున్నాడు.

author img

By

Published : Aug 20, 2019, 5:07 AM IST

Updated : Aug 20, 2019, 8:37 AM IST

ఉపాధ్యాయుడు
పాఠాలు బోధించేందుకు కొండలు దాటుతున్నాడు

విశాఖ మన్యంలో గ్రామాలు కొండలు, కోనల్లో విసిరేసినట్టు అక్కడ అక్కడ ఉంటాయి. ఏ గ్రామానికి వెళ్లాలన్నా సరైన రోడ్డుమార్గం ఉండదు. వాగులు, వంకలు దాటుకుంటూ కాలిబాటన పోవాల్సిందే. అలాంటి గ్రామమే పెదబయలు మండలంలోని జమదంగి. ఈ గ్రామానికి చేరుకోవాలంటే దాదాపు 20 కిలోమీటర్లు కొండలు, వాగులు దాటుకుంటూ వెళ్లాలి. బస్సులు, వాహనాలు లాంటివేమీ అక్కడి ప్రజలకు తెలీయదు. పాడేరు నుంచి ఉదయం 6 గంటలకు ప్రయాణం మొదలు పెడితే.... మధ్యాహ్నం 3 గంటలకు గానీ ఊరు చేరుకోలేం.

జమదంగిలో గిరిజన విద్యార్థుల కోసం పాఠశాల ఉన్నా....ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఉద్యోగం చేసేందుకు ఉపాధ్యాయులు ఎవ్వరూ ముందుకొచ్చేవారు కాదు. దీనివల్ల ఇక్కడి పిల్లలకు చదువు అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 2016లో ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించిన దాసుబాబుకు ....తొలి సర్కారు కొలువులో చేరేందుకు సాహసమే చేయాల్సి వచ్చింది. ఎంతో కష్టపడి అక్కడి వచ్చిన ఆ యువ ఉపాధ్యాయుడికి సమస్యలే స్వాగతం పలికాయి. రాత్రయిందంటే చాలు ప్రాణాలు హరించే విషదోమలతో తీవ్ర ఇబ్బందిపడాల్సి వచ్చింది. స్థానికుల కొండభాష నేర్చుకుంటే తప్ప...విద్యార్థులకు చదువు చెప్పలేమని తెలుసుకున్న దాసుబాబు అక్కడే ఉండి వారి వ్యవహారిక భాషమీద పట్టుసాధించి విద్యార్థులను మచ్చిక చేసుకున్నాడు. మెల్లమెల్లగా విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగించడమేగాక తెలుగుతో పాటు ఇంగ్లీష్‌ నేర్చుకునేలా వారిని తీర్చిదిద్దుతున్నాడు.

జమదంగి పాఠశాల విద్యార్థులు ప్రతిభ సామాజిక మాధ్యమాల ద్వారా అధికారుల దృష్టికి వెళ్లింది. అరకులో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు విద్యార్థులను తీసుకురావాల్సిందిగా ఆహ్వానం అందింది. ఎంతో సాహసంతో కూడిన ఆ మార్గం గుండా విద్యార్థులందరినీ తీసుకురాలేక....కేవలం ఇద్దరి విద్యార్థులతో దాసుబాబు అరకు చేరాడు. ఆ మారుమూల గ్రామం నుంచి వచ్చిన విద్యార్థుల ప్రతిభ చూసి అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఉపాధ్యాయ వృత్తిపట్ల తనకున్న అంకితభావమే ఎన్ని కష్టాలనైనా ఓర్చి అక్కడ పనిచేసేలా పురిగొల్పుతుందని యువ ఉపాధ్యాయుడు తెలిపారు. విద్యార్థులకు చదువు పట్ల ఉన్న ఆసక్తి తనను మరింత ఉత్సాహపరుస్తుందన్నారు. పాఠశాల శిథిలావస్థకు చేరడంతో చర్చిలోనే తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆధార్ ఆన్‌లైన్ సమస్యలతో విద్యార్థులకు రావాల్సిన ప్రోత్సహకాలు అందటం లేదని దాసుబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Last Updated : Aug 20, 2019, 8:37 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.