పాడేరు జిల్లా ఆసుపత్రిలో వైద్యుణ్ని.. ఉపాధ్యాయుడి కొట్టిన ఘటనలో వైద్యులు, సిబ్బంది ఆందోళనకు దిగారు. బుధవారం సాయంత్రం విధుల్లో ఉన్న వైద్యుడు అజయ్‌తో.. ఓ రోగి బంధువైన ఉపాధ్యాయుడు ఘర్షణకు దిగాడు. మద్యం మత్తులో వైద్యుడిపై దాడి చేశాడు. దీనిపై డాక్టర్లు, సిబ్బంది విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. ఎన్నో ఇబ్బందులకోర్చి ప్రజలకు సేవ చేస్తున్న తమపై ఇలాంటి దాడులు జరగడం అమానుషమన్నారు. సదరు ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై జిల్లా అదనపు వైద్యాధికారి లీలాప్రసాద్ వైద్యులతో చర్చించారు. దాడిని ఖండించారు. దీనిపై ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వరరావు, ఎస్పీ రాజ్‌కుమార్‌లకు ఫిర్యాదు చేశారు. విధుల్లో చేరి గిరిజనులకు వైద్యం అందించాలని కోరారు. వైద్యులు పట్టువీడలేదు. లిఖితపూర్వకంగా తమకు న్యాయం జరిగేలా హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టంచేశారు.
ఇవీ చదవండి..