ETV Bharat / state

Baby killed: విశాఖ మారికవలసలో మూడేళ్ల చిన్నారి హత్య

Baby killed :
Baby killed :
author img

By

Published : Jun 3, 2021, 2:46 PM IST

Updated : Jun 3, 2021, 8:12 PM IST

14:41 June 03

పోలీసులతో గ్రామస్థుల వాగ్వాదం..

Baby killed : విశాఖ మారికవలసలో మూడేళ్ల చిన్నారి హత్య

విశాఖ మారికవలసలో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిని అమానుషంగా హత్య చేశారు. అనుమానాస్పద హత్యగా పోలీసులు నమోదు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి హత్య వెనక భిన్నకోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం కోసం చిన్నారి తల్లి వరలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 

అసలేం జరిగింది.. 

రెండు రోజుల క్రితం మూడేళ్ల చిన్నారిని దారుణంగా చంపేసి దహన సంస్కారాలు పూర్తి చేశారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో చిన్నారి తల్లిపై కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. భర్తకు దూరంగా ఉంటున్న వరలక్ష్మి.. వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు పోలీసుల విచారణలో ప్రాథమికంగా వెల్లడైంది. ఈ క్రమంలోనే హత్య జరిగిందనే కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. స్థానిక ఎమ్మార్వో సమక్షంలో... చిన్నారి మృతదేహానికి పంచనామా జరిపించారు. నిందితురాలైన వరలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ దగ్గర ఉన్న సమాచారాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. కేసు విచారణ దశలో ఉందని ఏసీపీ కుమారస్వామి, సిఐ రవికుమార్​లు తెలియజేశారు. 

ఇవీ చూడండి : FB friend requests: సోషల్​గా వంచించి.. నైస్​గా నమ్మించి.. అడ్డంగా దోచేస్తున్నారు!

Last Updated : Jun 3, 2021, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.