విశాఖ జిల్లా చీడికాడ మండలం చినకోనాం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంక్రాంతిని కుంటుంబంతో సరాదాగా గడుపుదామని స్వగ్రామానికి వెళ్లిన ఓ వ్యక్తి.. విద్యుత్ తీగ తగిలి చనిపోయాడు. జూరెడ్డి వరాహమూర్తి (33).. అచ్యుతపురంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. సంక్రాంతికి భార్య, పిల్లలతో కలిసి సొంతూరు చినకోనాం చేరుకున్నారు. ఈ క్రమంలో ఇంటి ముందు.. భూమిని చదును చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తెగి అతని పై పడింది. ఈ ప్రమాదంలో వరాహమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
కరెంట్ స్తంభం వద్ద మెరుపులు వస్తున్న సమయంలో విద్యుత్ ఉప కేంద్రానికి సమాచారం ఇచ్చినా.. పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో సత్తా చాటేలా... విశాఖలో చర్యలు: సృజన