ప్రపంచంలోని దేశాలన్నీ పర్యటించాలని పెట్టుకున్న సంకల్పాన్ని 95 శాతం పూర్తి చేయడం ఆనందంగా ఉందని విశాఖపట్నానికి చెందిన రవిప్రభు తెలిపారు. ప్రపంచ యాత్ర అనుభవాలను... నగరంలోని డాల్ఫిన్ హోటల్ లో ఆయన తన స్నేహితులతో పంచుకున్నారు. ఇప్పటి వరకు 185 దేశాలు తిరిగొచ్చిన రవిప్రభు... ఇంకో 9 దేశాలు పర్యటిస్తే ప్రపంచాన్ని చుట్టేసిన ఆనందం కలుగుతుందని, ఆశయం సైతం పూర్తవుతుందని చెప్పారు. 17 ఏళ్ల కాలంలోనే ఇన్ని దేశాలు సందర్శించిన తెలుగువ్యక్తిగా ఘనత సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
నేను పుట్టింది ఒడిశాలోనైనా... పెరిగింది, చదివింది మాత్రం విశాఖపట్నంలోనే. అందుకే ఈ నగరం అంటే ఎంతో ఇష్టం.తొమ్మిదేళ్లప్పుడే తొలిసారి భూటాన్ వెళ్లాను. అదే నేను మొదటిగా సందర్శించిన విదేశం. అప్పటి నుంచి ట్రావెలింగ్ పై ఆసక్తి ఏర్పడి... ప్రపంచంలోని అన్ని దేశాలు పర్యటించాలనుకున్నాను.
- రవి ప్రభు, ప్రపంచ పర్యాటకుడు
ఇదీ చదవండి: