విశాఖ మన్యం హుకుంపేట మండలం గడుగుపల్లికి చెందిన విశ్వనాథం.... డీఎస్సీ-2018 ద్వారా ఉద్యోగం సంపాదించి..... 2020 సెప్టెంబర్ నుంచి సీలేరు గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడి ప్రధానోపాధ్యాయుడికి సీఎఫ్ఎంఎస్ ఐడీ లేక 9 నెలలుగా విశ్వనాథం వేతనం అందుకోలేకపోయారు. ఇంతలో సీలేరు వాతావరణం పడక అనారోగ్యం బారినపడ్డారు. ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లే ఆర్థిక స్థోమత లేక కుటుంబసభ్యులు కేజీహెచ్‌లో జాయిన్ చేశారు. రెండు నెలల పాటు చికిత్స అందుకున్న విశ్వనాథం..ఇటీవలే మరణించారు. దీంతో మృతుడి భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నలుగురు పిల్లలతో కుటుంబ పోషణ ఎలా అని వేదన చెందుతున్న ఆమె.. ప్రభుత్వమే తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.
వేతనం పడలేదన్న అంశంపై గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకుడిని వివరణ కోరగా.. డీడీవోలందరికీ సీఎఫ్ఎంఎస్ ఐడీ గురించి అవగాహన కల్పించామన్నారు. అవగాహనలేమితో వ్యవహరించిన సీలేరు గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మెమో జారీ చేశామన్నారు.
ఇదీ చదవండి..: suicide: కుటుంబ కలహలతో గర్భిణి ఆత్మహత్య