విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో భూ తగాదాల కారణంగా ఓ యువకునిపై కత్తితో దాడి జరిగింది. పాడేరు మండలం బడిమెల కాలనీలో రాంబాబు, సింహాద్రి కుటుంబాల మధ్య భూతగాదాలు నడుస్తున్నాయి.
పసుపు పొలంలో సింహాద్రి పనిచేస్తుండగా.. రామయ్య అనే వ్యక్తి భార్య వచ్చి సింహాద్రి కళ్లల్లో కారం కొట్టింది.. రామయ్య కత్తితో నరికాడు. తీవ్ర గాయాలపాలైన సింహాద్రిని పాడేరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వచ్చేసరికి రామయ్య కుటుంబం పరారీలో ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: