ETV Bharat / state

న్యూజిలాండ్​లో పెళ్లి.. యూఎస్​లో గొడవ.. ఇండియాలో..! - Amaravati news

A dispute arose between an NRI couple in Hyderabad: హైదరాబాద్‌లో ఎన్‌ఆర్‌ఐ దంపతుల మధ్య వివాదం నెలకొంది. ఈ వివాదం దేశాలు దాటింది. యూఎస్​లో ఉన్న భార్య, భారతదేశంలో ఉన్న భర్తపై కేసు నమోదు చేసింది. దీనిపై పోలీసులు స్పందించి దర్యాప్తు చేస్తున్నారు.

న్యూజిలాండ్​లో పెళ్లి యూఎస్​లో గొడవ
NRI couple news
author img

By

Published : Dec 20, 2022, 8:47 PM IST

A dispute arose between an NRI couple in Hyderabad: తరుణం నాజ్‌, శ్రీనివాస్ అనే వాళ్లు 2015 సంవత్సరంలో న్యూజిలాండ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారు యూఎస్​లో స్థిరపడ్డారు. వీరిద్దరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. తరచూ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె.. భర్తపై యూఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గొడవలు పెరిగాయి.

పోలీసుల కథనం ప్రకారం... శ్రీనివాస్ తన కొడుకును చూసేందుకు వచ్చి.. భార్యకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇండియాకి తీసుకొచ్చాడు. కుమారుడు ఇంటి దగ్గర లేకపోడంతో ఆమె తన భర్తకు ఫోన్ చేయగా.. ఇండియాకు తీసుకొచ్చాడన్న విషయం చెప్పాడు. వెంటనే ఆమె హైదరాబాద్ సరూర్​నగర్​ మహిళా పోలీసులకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు... శ్రీనివాస్​పై లుక్ అవుట్ నోటిసు ఇచ్చి 498 కేసు నమోదు చేశారు. కొత్తపేట కమలాపురి కాలనీలో నివాసముంటున్న శ్రీనివాస్ ఇంటికి తాళాలు వేసి ఉండడంతో అతని ఫోన్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.