ETV Bharat / state

Harassment: భర్త, అత్త వేధిస్తున్నారంటూ కానిస్టేబుల్ భార్య ఫిర్యాదు - దిశ పోలీస్ స్టేషన్

భర్త, అత్త తనను వేధిస్తున్నారంటూ ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఈ మేరకు విశాఖలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్​లో శ్యామిలీ మీడియా సమావేశంలో తనపై భర్త, అత్త చేస్తున్న వేధింపులను వివరించింది.

Harassment
భర్త, అత్త వేధిస్తున్నారంటూ కానిస్టేబుల్ భార్య ఫిర్యాదు
author img

By

Published : Sep 17, 2021, 10:33 PM IST

భర్త, అత్త వేధిస్తున్నారంటూ కానిస్టేబుల్ భార్య ఫిర్యాదు

విశాఖ జిల్లా పద్మనాభం మండలం పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్న బత్తుల సంతోష్ కుమార్​కు శ్యామిలితో 2008 ఏప్రిల్ 10న వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక పాప, ఒక బాబు. గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగ్గా..పోలీసుల చొరవతో సద్దుమణిగాయి. మళ్లీ భర్త సంతోష్, అతని తల్లి వేధింపులకు గురి చేయడంతో తట్టుకోలేని శ్యామిలి పిల్లలతో సహా ఆమె పుట్టింటికి వెళ్లింది.

ఈ క్రమంలో పిల్లలను చూడాలని ఉందని కానిస్టేబుల్ సంతోష్ కుమార్, అతని తల్లి పైడిరాజు ఈనెల 15న తగరపువలసలోని వారి ఇంటికి రమ్మన్నారు. వారి మాటలు నమ్మిన శ్యామిలి పిల్లలతో సహా అత్తారింటికి వచ్చింది. వినాయక నిమజ్జనం సందర్భంగా ఇంటి డాబాపై నిల్చుని వేడుక చూస్తున్న శ్యామిలీపై.. ఆమె అత్త వెనుక నుంచి యాసిడ్ వంటి ద్రవాన్ని చల్లింది. వెనుకభాగం మండుతుండడంతో శ్యామిలి వెనుదిరిగి చూసింది. ఇంతలో అత్త పైడిరాజు ఒక బాటిల్​తో కిందకి పారిపోతూ ఉండడం చూసి ఆమెను అనుసరించి చేతిలో ఏంటని ప్రశ్నించింది. వెంటనే ఆమె అత్త పైడిరాజు ఆ బాటిల్ ని దూరంగా విసిరేసి వెళ్లిపోయింది. శ్యామల ఆ బాటిల్ ని వెతికి దాచి పెట్టింది. ఆమె ఆ బాటిల్ పట్టుకున్న శరీర భాగం కూడా కాలిపోయింది. వెంటనే అత్తవారింటి నుంచి బయలుదేరి శ్యామిలి విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో ఎంఎల్​సి చేయించుకున్నట్టు వివరించింది.

గతంలోనూ....

సంతోష్ కుమార్ కూర్మన్నపాలెం పోలీస్ స్టేషన్​లో పని చేస్తుండగా ఒక మహిళా కానిస్టేబుల్​తో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడని భార్య శ్యామిలీ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ స్టేషన్ సీఐ చొరవతో సమస్య పరిష్కారమయ్యిందని శ్యామిలీ తెలిపింది. పోలీస్ స్టేషన్​లో తాను ఫిర్యాదు చేసినందుకే కోపంతో సంతోష్ తనను చాలా రకాలుగా వేధింపులకు గురి చేశాడని శ్యామిలి చెబుతోంది. ఈ మేరకు దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా తనకు పోలీసు సిబ్బంది సహకరించారని.. అయినా తన భర్తలో మార్పు రాకపోవడంతో అతనిపై 498a చట్టం కింద కేసు నమోదు చేశారని శ్యామిలి వెల్లడించింది. తనను వేధింపులకు గురిచేస్తూ బాధిస్తున్న కానిస్టేబుల్ సంతోష్ కుమార్, అత్త పైడిరాజుపై చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని శ్యామిలి కోరింది.

భార్యను వేధింపులకు గురి చేస్తోన్న సంతోష్ కుమార్​ను విధుల నుంచి సస్పెండ్ చేయాలని అతనికి, అతని తల్లి పైడిరాజుకు కఠినశిక్ష పడేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని మహిళా చేతన అధ్యక్షురాలు కె.పద్మ కోరారు. శ్యామిలికి తాము అండగా ఉన్నామని తెలిపారు.

ఇదీ చదవండి : mother and son suicide: చెరువులో దూకి తల్లీకుమారుడు ఆత్మహత్య !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.