విశాఖ మన్యం పాడేరు ఘాట్ రోడ్డులోని వ్యూ పాయింట్ వద్ద కారులో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులను గమనించిన నిందితులు కారును వేగంగా నడపగా.. అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న భారీ రాయిని ఢీకొట్టింది. పోలీసులు 160 కిలోల గంజాయితో పాటు ఇద్దరు రాజస్థాన్‌కు చెందిన యువకులను అదుపులోకి తీసుకున్నారు.
మరో కేసులో పాడేరు మండలం వై.సంపాలు వద్ద తెల్లవారుజామున 32 మంది కూలీలు గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు మాటువేశారు. అది గమనించిన కూలీలు గంజాయి మూటలను వదిలి పారిపోగా... సుమారు 800 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
రెండు కేసుల్లో 960 కిలోల గంజాయి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.48 లక్షలు ఉంటుందని వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరి నిందితులను రిమాండ్‌కు తరలించారు.