కేరళ రాష్ట్రానికి చెందిన జింత్యోపి మా డ్యూ, మహమ్మద్ హసిమ్, మహమ్మద్ షా, జోసఫ్ టూరిజం పేరుతో అరకు వచ్చారు. అక్కడ 7 కేజీల గంజాయిని కొనుగోలు చేసి కారులో తరలిస్తుండగా అనకాపల్లి జాతీయ రహదారిపై పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి గంజాయితో పాటుగా నాలుగు సెల్ఫోన్లు, రూ.950 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
ఇదీ చదవండి :