రాష్ట్రంలో 2 వంద పడకల ఆస్పత్రులు నిర్మించనున్నట్టు కొవిడ్ కంట్రోల్ మిషన్ ప్రత్యేకాధికారి తెలిపారు. అమెరికన్ ఇండియా ఫండ్ నిధులతో ఆస్పత్రుల ఏర్పాటు చేయనున్నట్టు ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు. రంపచోడవరం, పాడేరులో ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. రూ.4 కోట్ల చొప్పున ఏఐఎఫ్ సంస్థ సమకూరుస్తుందని ఆర్జా శ్రీకాంత్ చెప్పారు. ప్రతి ఆస్పత్రిలో 92 సాధారణ, 8 ఐసీయూ పడకలుంటాయని ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు.
ఇదీ చదవండీ... కొవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్ ప్రత్యేకాధికారిగా ఆర్జా శ్రీకాంత్