విశాఖ మన్యం నుంచి ఓ కంటైనర్, బొలెరో, రెండు ద్విచక్ర వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 1365 కిలోల గంజాయిని నర్సీపట్నం పోలీసులు పట్టుకున్నారు. దారకొండ నుంచి గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు సీఐ స్వామినాయుడు, ఎస్సై లక్ష్మణ్ రావుల సారధ్యంలో తనిఖీలు చేపట్టారు. పట్టణానికి సమీపంలో జోగినాధం పాలెం వద్ద వాహనాల్లో విడివిడిగా లోడ్ చేసిన గంజాయిని పట్టుకున్నారు.
ఈ గంజాయి అక్రమ రవాణాతో సంబంధం ఉన్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కంటైనర్, బొలెరో వాహనాలతోపాటు మరో రెండు బైకులను పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. మూడు కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: