ETV Bharat / state

Fraud: రూ.2వేల నోట్ల మార్పిడి.. బదులుగా రూ.500 నోట్లు 10% కమీషన్​ అంటూ మోసం.. - Latest Andhra news

Vishaka Money Fraud: రెండు వేల రూపాయల నోట్లు ఇస్తే.. వాటికి బదులుగా 500 రూపాయల నోట్లు.. అదనంగా 10 కమీషన్​ చెల్లిస్తామని మోసానికి తెర లేపారు కొందరు వ్యక్తులు . నిజమని నమ్మిన ఓ వ్యక్తి 12 లక్షల రూపాయలు మోసపోయాడు.

Vishaka Money Fraud
Vishaka Money Fraud
author img

By

Published : May 2, 2023, 1:10 PM IST

Updated : May 2, 2023, 2:09 PM IST

Visakha Money Change Fraud: రెండు వేల రూపాయలకు బదులుగా నోట్లను మార్పిడి చేసి 500 రూపాయలు ఇస్తామని చెప్పి.. సుమారు 12 లక్షల రూపాయలకు టోకరా వేసిన ఘటన విశాఖలో జరిగింది. నోట్లు మార్పిడి చేసుకుంటే కమిషన్​ కూడా వస్తుందంటూ నమ్మబలికి మూకుమ్మడి మోసానికి తెర లేపారు. రెండు వేల రూపాయలు తీసుకుని వాటి స్థానంలో నల్ల కాగితాలు ఇచ్చి.. నగదుతో పరారయ్యారు

బాధితుని కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రావాడ గ్రామానికి చెందిన కెల్లా సురేష్​​ అనే వ్యక్తికి.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గంగాభవానీ అనే మహిళ పరిచయమైంది. ఈ నేపథ్యంలో ఆమె కేరళకు చెందిన బంగారం వ్యాపారం చేసే వ్యక్తులు తనకు తెలుసని సురేష్​కు చెప్పింది. వారికి ఓ ట్రస్ట్ర్​ కూడా ఉందని వివరించింది. వారికి 2 వేల రూపాయల నోట్లు ఇస్తే.. బదులుగా 500 రూపాయల నగదు ఇస్తారని తెలిపింది. అలా మార్పిడి చేసినందుకు 10 శాతం కమీషన్​ కూడా చెల్లిస్తారని నమ్మబలికింది. మార్పిడి చేసిన నగదుతో పాటు కమీషన్​ను రూపాయలు మొత్తం కలిపి 13.20 లక్షల రూపాయలు వెంటనే బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని పేర్కొంది.

నిజమని నమ్మిన సురేష్​ శనివారం శ్రీకాకుళం నుంచి ద్విచక్ర వాహనంపై 12 లక్షల రూపాయలు విశాఖకు తీసుకుని వచ్చాడు. విశాఖ నగరంలో ఆర్​అండ్​బీ ప్రాంతంలో గంగాభవానీ సురేష్​కు కలిసింది. ఈ క్రమంలో ఆమె నోట్లు మార్పిడి చేస్తాడంటూ కృష్ణ అనే వ్యక్తిని సురేష్​కు పరిచయం చేసింది. దీంతో సురేష్​ డబ్బును నల్లని పాలిథీన్​ కవర్​లో పెట్టి కృష్ణకు ఇచ్చాడు. కృష్ణ వెంటనే ఆ నగదు ఓ బ్యాగ్​లో పెట్టాడు. అనంతరం కేరళకు చెందిన వ్యక్తులు సమీపంలోని రెస్టారెంట్​లో ఉన్నారని అక్కడే డబ్బులు ఇస్తారని రెస్టారెంట్​కు సురేష్​ను తీసుకుని వెళ్లాడు. అక్కడ ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేసి వీరే కేరళకు చెందిన వారని చెప్పాడు. వెంటనే వారు ఓ సూట్​ కేసు చూపించి అందులో నగదు ఉన్నాయని.. దాని తాళాలు మరిచిపోయామన్నారు. దగ్గరలో ఉన్న బ్యాంకుకు వెళ్తే నీ నగదు నీకు ఇస్తామని తెలిపారు. అప్పటి నీ డబ్బులు నీ దగ్గరే ఉండనివ్వు అని సురేష్​ ఇచ్చిన పాలిథిన్​ కవర్​కు బదులుగా ఆ కవర్​ను పోలీన మరో కవర్​ అతనికి ఇచ్చారు.

బ్యాంక్​కు బయలుదేరేందుకు రెస్టారెంట్ నుంచి​ బయటకు వచ్చారు. అందరం కలిసి ఆటోలో వెళ్దామని చెప్పి అందరు దగ్గరలోని బ్యాంక్​కు ఆటోలో బయల్దేరారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆటో వద్దని కారులో వెళ్దామన్నారు. ఆటోలోంచి దిగే సమయంలో సురేష్​ను ముందుగా దించి వారు ఆదే ఆటోలో పరారయ్యారు. వారు ఆటో దింపగానే సురేష్​కు అనుమానం కలిగి వారు తిరిగి ఇచ్చిన కవర్​ను తెరిచి చూడగా.. అతనికి అసలు విషయం అర్థమైంది. తాను మోసపోయానని లభోదిభోమంటూ స్థానిక పోలీస్​ స్టేషన్​కు పరుగులు తీశాడు. జరిగిన కథ మొత్తం పోలీసులకు వివరించి.. తనకు తిరిగి ఇచ్చిన కవర్​లో తన 12 లక్షల నగదుకు బదులు నోట్ల రూపంలో ఉన్న నల్లటి కాగితాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి :

Last Updated : May 2, 2023, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.