ETV Bharat / state

సడలని 'ఉక్కు' సంకల్పం - వెయ్యి రోజులకు చేరిన స్టీల్​ ప్లాంట్ కార్మికుల దీక్షలు

1000th day Agitation of Visakha Steel Plant Workers: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాటం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వెయ్యోరోజూ ఆందోళన చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులతోపాటు వారి కుటుంబ సభ్యులు వివిధ విద్యార్థి, ప్రజా సంఘాలు నిరసనల్లో పాల్గొన్నాయి.

visakha_steel_plant_workers
visakha_steel_plant_workers
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 2:36 PM IST

1000th day Agitation of Visakha Steel Plant Workers: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ..వెయ్యి రోజులు పోరాటం కొనసాగుతోంది..వెయ్యివ రోజు నిరసనను విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద భారీగా నిర్వహిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, వివిద ప్రజా సంఘలు సాహితి సంఘాలు, విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త బంద్ కొనసాగుతోంది.. ఈ క్రమంలో కార్మికుల వెయ్యోరోజు ఆందోళన.. స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. కూర్మన్నపాలెం కూడలిలో జాతీయ రాహదారిపై బైఠాయించేందుకు యత్నించిన కార్మికులను.. వివిధ పార్టీల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖలో రాజధాని పెట్టాలనుకుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేలా.. కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీఎం జగన్​ను కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.

విశాఖ ఉక్కు పోరాటానికి వెయ్యి రోజులు - ప్రభుత్వ స్పందన లేకపోవడంపై మండిపడుతున్న కార్మిక సంఘాలు

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపాలంటూ.. కూర్మన్నపాలెం కూడలి వద్ద కార్మికులు వాహనాలకు అడ్డుగా నిలబడి.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. వారికి వివిధ రాజకీయ ప్రజాసంఘాల నేతలు మద్దతు పలికారు. రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు స్టీల్‌ ప్లాంట్‌ ప్రధాన ద్వారం వద్ద రిలే నిరాహార దీక్షా శిబిరం కూడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగుతోంది. స్టీల్ ప్లాంట్ కార్మికుల కుటుంబ సభ్యులు, విద్యార్థి, ప్రజా సంఘాలు నేతలు దీక్షలో పాల్గొన్నారు.

State Bandh for Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు, కడప ఉక్కు పరిశ్రమ సాధనకు నవంబర్​ 8న బంద్‌

Lokesh Comments on Privatization of Steel Plant: విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రజలు సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్.. జగన్ అనే అవినీతి నేర పాలకుడి వల్ల ప్రైవేటు పరమవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. స్టీల్‍ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా పోరాట కమిటీ చేపట్టిన ఉద్యమానికి వెయ్యి రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా కార్మికులకి ఉద్యమాభివందనాలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటానికి తెలుగుదేశం పార్టీ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని స్పష్టం చేశారు.

What Happened Visakha Steel Plant Sankalpam Jagan?: విశాఖ స్టీల్ ప్లాంట్ సంకల్పం ఏమైంది జగన్..?

CPI Ramakrishna Comments on Privatization of Steel Plant: విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించి కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖ పరిశ్రమ ప్రైవేటీకరణ చేయ్యకుండా ఉండాలని విద్యార్థి సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలను బందు చేశారు. అందులో భాగంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కడప ఉక్కు పరిశ్రమకు ఇప్పటివరకు నాలుగు సార్లు శంకుస్థాపన చేశారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం లేదని రామకృష్ణ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి అభివృద్ధి చేసిందో చెప్పాలన్నారు. ప్రతిపక్ష నేత పవన్ కల్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మెదీతో మాట్లాడి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం కాకుండా చూడాలని ఆయన కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.