ప్రకాశం జిల్లా మార్కాపురంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సచివాలయ ఉద్యోగ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఓ అభ్యర్థిని కన్నీటి పర్యంతమైంది. అగ్రికల్చరల్ విభాగంలో గిద్దలూరుకు చెందిన ఎన్. కామేశ్వరి అనే యువతి నియామక పత్రాల పంపిణీలో తమ పేరు లేదని ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు వద్ద పన్నీటి పర్యంతమైంది. తాను ధ్రువ పత్రాల పరిశీలనకు కూడా వెళ్లానని కానీ ఇక్కడ తమ పేరు రాకపోవటమేమిటో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు చొరవ తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరింది.
ఇదీచదవండి