రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజు నియమితులయ్యారు. ఇవాళ ఉదయం విజయవాడలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన అనంతరం.. ఈ నియామకం చేసింది.
పంచాయతీరాజ్ చట్టంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన సెక్షన్ 200ని పూర్తిగా మార్చేస్తూ శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ కారణంగా.. ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై ప్రభుత్వం వేటు వేసినట్లయింది. ఆర్డినెన్స్ అమల్లోకి రావడంతో ఆయన పదవీ కాలం అర్ధంతరంగా ముగిసింది. కొత్త కమిషనర్‌గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజు పేరును ప్రతిపాదిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదానికి దస్త్రం పంపింది. గవర్నర్ ఆమోదించడగా.. జస్టిస్ కనగరాజు ఇవాళ బాధ్యతలు చేపట్టారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలోని పలు విభాగాలను పరిశీలించారు. ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇదీ చదవండి: