ETV Bharat / state

YSRCP Samajika Sadhikarata Bus Yatra in Tirupati : వైసీపీ సామాజిక సాధికారత బస్సుయాత్ర.. సామాన్యులకు తప్పని అవస్థ

YSRCP Samajika Sadhikarata Bus Yatra in Tirupati :ఈ నెల 26 న ప్రారంభమైన వైసీపీ సామాజిక సాధికారత బస్సుయాత్ర ప్రజలకు సమస్యగా మారింది. రాష్ట్రంలోని పలు చోట్ల రోడ్లకు అడ్డంగా సభా వేదికలు ఏర్పాటు చేయడం, వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధించడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి, విజయనగర రహదారుల్లో ప్రయాణం కష్టతరమవుతోందని ప్రజలు వైసీపీ నేతలు, పోలీసు అధికారుల తీరు పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Etv BharatSamajika Bus Yatra Day 2
YSRCP Samajika Sadhikarata Bus Yatra in Tirupati
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2023, 5:07 PM IST

YSRCP Samajika Sadhikarata Bus Yatra in Tirupati : వైసీపీ సామాజిక సాధికారత బస్సుయాత్రతో ప్రజలకు తిప్పలు

YSRCP Samajika Sadhikarata Bus Yatra in Tirupati : వైసీపీ సామాజిక సాధికారత బస్సుయాత్ర ప్రజలకు సమస్యగా మారింది. తిరుపతి, విజయనగరం సహా రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్​ సీపీ సామాజిక సాధికార యాత్ర కారణంగా ప్రజలకు అవస్థలు తెచ్చిపెడుతోంది. ఈ సందర్భంగా వాహన రాకపోకలకు ఆంక్షలు విధించారు. అలిపిరి నుంచి బాలాజీ వరకు ట్రాఫిక్ నిబంధనలు విధించారు. వాహనాలను అనుమతించకపోవడంతో వానదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఖరికి108 వాహనం వెళ్లడానికి కూడా తిప్పలు తప్పడం లేదు ప్రజలకు.

"ఒక్క రూపాయీ విడుదల చేయకుండా.. ఇలా యాత్రలు కూడా చేస్తారా"

Samajika Bus Yatra Day 2 : యాత్ర ప్రారంభం కాక ముందే రహదారులను పోలీసులు, వైసీపీ నాయకులు దిగ్బంధం చేశారు. నగరంలోని పలు కూడళ్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాలనీల నుంచి రాకపోకలు నిలిపేశారు. దీంతో చిత్తూరు, మదనపల్లె నుంచి తిరుపతి నగరంలోకి వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బాలాజీ కాలనీ నుంచి పశువైద్య విశ్వవిద్యాలయం వరకు రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవెపు బాలాజీ కాలనీ నుంచి మహిళా విశ్వవిద్యాలయం వరకు వాహనాలు ఆగిపోయాయి. నగరంలోని బస్టాండ్‍, రైల్వేస్టేషన్‍, ఎన్టీఆర్‍ కూడలి, అలిపిరి, ఐఎస్‍ మహల్‍ కూడళ్ళలో ట్రాఫిక్‍ అంక్షలతో నగరవాసులు ఇబ్బందులకు గురయ్యారు.

చంద్రబాబుకు మద్దతుగా మాజీ సర్పంచ్ బృందం.. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర

Samajika Sadhikarata Bus Yatra Problems to People : వైసీపీ తలపెట్టిన సామాజిక బస్సు యాత్ర స్థానికులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది విజయనగరం జిల్లా గజపతినగరంలో సామాజిక సాధికారిక బహిరంగ సభ కారణంగా ఉదయం నుంచే ఆంక్షలు విధించారు. విజయనగరం నుంచి గొట్లం వరకు బైక్ ర్యాలీ తర్వాత బహిరంగ సభ జరుగుతుందని, గజపతినగరం మండల కేంద్రంలోని మెంటాడ మెయిన్ రోడ్డులో బహిరంగ సభ కోసం వేదిక ఏర్పాటు చేశారు. రోడ్డుకు అడ్డంగా స్టేజ్​ వేయడం వల్ల మెంటాడ, ఆండ్రతో పాటు సుమారు 10 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెంటాడ మీదుగా ఆండ్ర వెళ్లాల్సిన బస్సు కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

జనసేన-టీడీపీ కలిస్తే భయమెందుకు..? ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే చెప్తా: పవన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.