ETV Bharat / state

'అందిన కాడికి దోచుకో పుష్పా' ఇది మన జగనన్న ప్రభుత్వం - YCP leaders smuggling red sandalwood

YSRCP Leaders Smuggling Red Sandalwood in Seshachalam Forests: ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఒకప్పుడు ఈ పదమే స్మగ్లర్లకు టెర్రర్‌.! ఇప్పుడు ఆ పేరుకున్న పవర్‌నే వైఎస్సార్​సీపీ సర్కార్‌ తీసేసింది. నిఘాను నిద్రపుచ్చారు.! సీసీ కెమెరాలు తొలగించారు! చెక్‌ పోస్టులుఎత్తేశారు.! తనిఖీలను మొక్కుబడిగా మార్చేశారు. కూంబింగ్‌ ఆపరేషన్లకు స్వస్తి పలికారు. "రమణా లోడెత్తాలిరా”అన్నట్లు దుంగలు తరలించే దొంగలకు దారిస్తున్నారు. ఎర్ర దొంగల కట్టడికి గత ప్రభుత్వం నెలకొల్పిన పటిష్ట వ్యవస్థనే జగన్‌ ప్రభుత్వం నీరుగార్చింది.

ycp_leaders_smuggling
ycp_leaders_smuggling
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 7:10 AM IST

Updated : Dec 23, 2023, 10:34 AM IST

'అందిన కాడికి దోచుకో పుష్పా' ఇది మన జగనన్న ప్రభుత్వం

YSRCP Leaders Smuggling Red Sandalwood in Seshachalam Forests: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం గొల్లచిమ్మనపల్లెకు చెందిన అభినవ్‌ ఏపీ నుంచి ఎర్రచందనం తరలిస్తూ గతేడాది కర్ణాటకలోని కోలార్‌లో పోలీసులకు చిక్కాడు. ఇక్కడ ఎవరికైనా కొన్ని సందేహాలు వస్తాయి. అభినవ్‌ను కర్ణాటక పోలీసులు పట్టుకునే వరకూ మన పోలీసులు ఏం చేస్తున్నారు? కోలార్‌ వరకూ అందరి కళ్లుగప్పి ఎలా వెళ్లాడు.? మన భద్రత మరీ అంత వీక్‌గా ఉందా? వీక్‌గా ఉండడం కాదు, కావాలనే వీక్‌ చేశారు.? అభినవ్ అధికార పార్టీ ఎంపీటీసీ, అందులోనూ చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరుడు. ఇక అభినవ్‌ను ఆపే ధైర్యం ఎవరు చేస్తారు? అందుకే స్మగ్లింగ్‌ చేస్తున్నారని తెలిసినా ఏపీ పోలీసులు కళ్లుమూసుకున్నారు. కర్ణాటక పోలీసులు మాత్రం పట్టుకున్నారు.

వైసీపీ నేతల ఖనిజ దోపిడీకి రాజమార్గం- వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం

టీడీపీ ప్రభుత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌: శేషాచల అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కొత్తేమీ కాదు. స్మగ్లింగ్‌ను అరికట్టడం పోలీసులకు పెద్ద పనేమీ కాదు.! కాకపోతే ఆ పని చేయొద్దనడం వల్లే ఇప్పుడు అక్రమరవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ అరికట్టడాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఓ సవాల్‌గా తీసుకుంది. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. అదనపు సిబ్బందిని నియమించింది. ఐజీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించింది. ఆ కార్యదళం నిరంతరం గస్తీ, తనిఖీలు నిర్వహించేది. కూంబింగ్‌కు వెళ్లి అడవిలో చెట్లు నరుకుతున్న వారిని పట్టుకునేది. అలాంటి వ్యస్థను వైఎస్సార్​సీపీ సర్కార్‌ నిర్వీర్యం చేసేసింది.

ఐజీ స్థాయి అధికారిని తప్పించేసి టాస్క్‌ఫోర్స్‌ పగ్గాలను అదనపు ఎస్పీ స్థాయి అధికారికి అప్పగించింది. పర్యవేక్షణ బాధ్యతలను రేంజ్‌ డీఐజీకి ఇచ్చింది. సిబ్బంది సంఖ్యను తగ్గించేసింది. చెక్‌పోస్టులు ఎత్తేసింది. తనిఖీలు మొక్కుబడిగా మార్చేసింది. గతంలో ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులు మారువేషాల్లో మాటువేసి మరీ ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టేవారు. ఇప్పుడు ఆ ఊసేలేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద అమర్చిన సీసీ కెమెరాల్ని సైతం పీకేశారు. మొత్తంగా కార్యదళం కోరలు పీకేసింది.

కోట్ల రూపాయల ఖనిజ సంపద కొల్లగొడుతున్నారు, అంతా ఆ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే!

పోలీసులే దగ్గరుండి వాహనాల తరలింపు: ఎర్రచందనం స్మగ్లింగ్‌ను కట్టడిచేయాల్సిన ప్రభుత్వం కట్టడి కోసం గతంలో నెలకొల్పిన వ్యవస్థను ఎందుకు కట్టడి చేసింది. అడ్డగోలు దోపిడీకి ఎందుకు గేట్లుఎత్తింది.? ఇందులో అర్థంకాక పోవడానికి ఏముంది? ఎర్రదొంగల్ని తెరవెనక, ముందుండి నడిపిస్తోంది అధికార పార్టీ నేతలు, వారితో సన్నిహిత సంబంధాలున్నవారే! కొందరు పోలీసులూ వారికికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసులే దగ్గరుండి అక్రమ రవాణా వాహనాల్ని సరిహద్దులు దాటిస్తున్నారు. అప్పుడప్పుడూ ఒకటి రెండు చిన్న వ్యాన్లు పట్టుకుని అందులోని కూలీలు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. సూత్రధారులైన అధికార పార్టీ నాయకులను కేసుల నుంచి తప్పిస్తున్నారు.

చిన్నాచితకా స్మగర్లుగా ఉన్నవారూ వైఎస్సార్​సీపీ కండువాలు కప్పేసుకున్నారు. స్మగ్లింగ్‌ ద్వారా సంపాదించిన డబ్బుతో కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అవతారమెత్తారు. మరికొందరు నామినేటేడ్‌ పదవులు దక్కించుకున్నారు. పెద్ద నాయకుల అండదండలు తోడవడంతో ఇక స్మగ్లింగ్‌ సాఫీగా సాగిపోతోంది. ఒకప్పుడు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ స్మగ్లింగ్‌ చేసేవారు. ఇప్పుడు స్థానిక నాయకులే స్మగ్లర్లుగా మారి దోచుకుంటున్నారు.

టెండర్లు ఖరారు కాకుండానే ఇసుక తవ్వకాలు - టెండర్ పెట్టింది సీఎంవోనా?

కారుపై జగన్‌ ఫొటోతో ఉన్న స్టిక్కర్‌: తెలుగుదేశం హయాంలో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని వేలం వేసి ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చుకోగలిగారు. స్మగ్లర్లపై పీడీ యాక్టు ప్రయోగించారు. ఇప్పుడు కళ్లముందే నిత్యం వందలాదీ లారీల్లో ఎర్రచందనం తరలిపోతున్నా పట్టుకునే నాథుడే లేడు. తమిళనాడులోని తిరుప్పత్తూరు జిల్లా అంబూర్‌ సమీపంలో ఆ రాష్ట్ర అటవీ అధికారులు రెండేళ్ల క్రితం తనిఖీల సందర్భంగా ఎర్రచందనం దుంగలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారుపై ముఖ్యమంత్రి జగన్‌ ఫొటోతో ఉన్న స్టిక్కర్‌ ఉంది. ఆ స్టిక్కర్‌పై భాస్కరన్‌ ఆలిండియా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరవై రాష్ట్ర అధ్యక్షుడు అని రాసి ఉంది. వైఎస్సార్​సీపీలో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన ఓ నాయకుడి అనుచరులే పీలేరు ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాజంపేట ప్రాంతానికి చెందిన మరో వైఎస్సార్​సీపీ నేత ఆయన అనుచరులు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Last Updated : Dec 23, 2023, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.