Venkatagiri YSRCP Councillors: ‘పార్టీ కోసం తొలి నుంచి కష్టపడుతుంటే కొందరు స్వలాభాలు చూసుకుంటున్నారు. వార్డు సమస్యలపై అడిగినా పట్టించుకోకపోవడంతో ప్రజల వద్దకు ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది..’ అని తిరుపతి జిల్లా వెంకటగిరి పురపాలికలోని కొందరు వైకాపా కౌన్సిలర్లు తీవ్రంగా ధ్వజమెత్తారు. శనివారం వివిధ అంశాలపై వారు తమ అసమ్మతి గళం విప్పారు. పట్టణంలో అభివృద్ధి పనులు కొన్ని వార్డులకే పరిమితమవుతున్నాయని, పార్టీ కోసం పని చేసే వారికి సరైన న్యాయం జరగడం లేదని, పార్టీకి ఓటు వేయనివారు పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు.
కౌన్సిల్ సమావేశంలోనే మహిళా కౌన్సిలర్లపై కొందరు దురుసుగా ప్రవర్తిస్తుంటే వాటినీ అడ్డుకోవడం లేదని చెప్పారు. పట్టణంలో చేసిన కొద్దిపాటి అభివృద్ధి పనుల్లో నాణ్యత కొరవడిందని ఆరోపించారు. గుత్తేదారులు ఏడాదిగా పనుల్ని చేయకపోవడంతో ప్రజలు నిలదీస్తున్నారని, వార్డుల్లోకి వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని చెప్పారు. కనీసం వీధి దీపం వెలిగించలేని స్థితిలో ఉన్నామని వాపోయారు.
ఇవీ చూడండి: