MP SRIDHAR: భాజపాకు మద్దతు ఇస్తుండటంతోనే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో వస్తున్నాయని ఏలూరు వైకాపా ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. మంగళవారం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ‘వైకాపా మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకూ మద్దతు ఇస్తోందనడంలో సందేహం లేదు. దీంతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా సహకారంతో ఏపీకి రావాల్సిన నిధులు సకాలంలో వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దని సంతకం చేశారు. అయితే సీఎం జగన్ ప్రత్యేక హోదా విషయాన్ని ప్రతి వేదికలో కేంద్రం దృష్టికి తీసుకెళుతున్నారు. 2024 ఎన్నికల్లో వైకాపాకు మంచి అవకాశం వస్తుందని ఆశిస్తున్నాం. కేంద్రంలో వచ్చే ప్రభుత్వంలో పాల్గొనే అవకాశం వస్తే, ప్రత్యేక హోదాను ఓ నిబంధనగా ఉంచి సాధిస్తామని స్పష్టం చేస్తున్నా. చంద్రబాబులా ఇచ్చిన హామీలను మరచిపోకుండా.. తప్పనిసరిగా సీఎం జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తారు’ అని కోటగిరి శ్రీధర్ అన్నారు.
ఇవీ చదవండి: