International Ganja Smuggling Gang Arrested: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా.. తెలుగు భాషతోపాటు కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో అఖండ విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో హీరో అల్లు అర్జున్.. గుట్టుచప్పుడు కాకుండా ఎర్ర చందనం తరలించే విషయంలో మొదటగా ఒక పాల వ్యాన్‌ను ఏర్పాటు చేసి.. పైన పాలు పోసి.. కింద ఎర్ర చందనం దుంగలు పెట్టి, వెల్డింగ్ చేసి అక్రమ రవాణా చేస్తాడు. ఆ సీన్‌ను ఆదర్శంగా తీసుకుని కొంతమంది గంజాయి స్మగర్లు అంతర్జాతీయ స్థాయిలో గంజాయిని రవాణా చేయటం మొదలుపెట్టి, తిరుపతి జిల్లా పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
Ayyanna fire on police officers: గంజాయి రవాణాపై పోలీసులవి అబద్ధాలు.. ఇవిగో నిజాలు: అయ్యన్న పాత్రుడు
240 కిలోల గంజాయి పట్టివేత.. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పైన భాగంలో కూరగాయలు పెట్టి.. కింద భాగంలో గంజాయిని ఉంచి.. అనకాపల్లి జిల్లా నుంచి శ్రీలంకకు తరలిస్తున్న అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యులను.. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట క్రాస్ కూడలి పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. అనుమానం వచ్చి రెండు వాహనాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో సుమారు రూ.48 లక్షల విలువైన 240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గంజాయిని తరలిస్తున్న 8 మంది సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పారిపోయారు. ముఠా సభ్యుల నుంచి 5 సెల్‌ఫోన్లు, బొలెరో ట్రక్ వాహనంతోటు ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
Police seized ganja: భారీగా గంజాయి పట్టివేత.. ఐదుగురు అరెస్ట్
అనకాపల్లి- శ్రీలంకకు గంజాయి రవాణా.. అనంతరం గంజాయి తరలిస్తూ పట్టుబడిన నిందితులను వివరాలను, పట్టుబడిన గంజాయి విలువను మీడియా సమావేశం ఏర్పాటు చేసి తిరుపతి జిల్లా ఎస్పీ.. పరమేశ్వర రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''ఈరోజు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట క్రాస్ కూడలి వద్ద తనిఖీలు చేపట్టాము. ఈ తనిఖీల్లో అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశాము. తనిఖీలలో గంజాయి తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నాం. వాహనంలో 240 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించాం. ఈ గంజాయిని ఎనిమిది మంది స్మగర్లు కలిసి అనకాపల్లి జిల్లా నుంచి శ్రీలంకకు తరలిస్తున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
అరెస్టు అయినవారిలో ఐదుగురు తమిళనాడుకు చెందిన వారున్నారు. మరో ముగ్గురు అనకాపల్లి జిల్లాకు చెందిన వారున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు అప్పలనాయుడు, శ్రీలంకకు చెందిన ఖాదర్ భాయ్. వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపట్టనున్నాం. ముద్దయిల నుంచి ఐదు చరవాణులు, బొలెరో ట్రక్, ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.48 లక్షల రూపాయలు ఉంటుంది. ఇదివరకే ఈ నిందితులు గంజాయిని శ్రీలంకకు తరలించారు. ఈసారి కూడా అలానే తరలించబోయి పోలీసులకు పట్టుబడ్డారు.'' అని ఆయన అన్నారు.
visakha CP On Ganja : 'గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేస్తాం.. విక్రయిస్తే పీడీ యాక్ట్'