Tirupati Venkateswara Swamy: నవంబరు ఒకటో తేదీ నుంచి తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతిలో మూడు ప్రదేశాల్లో సర్వదర్శన టికెట్లు జారీ చేస్తామని తెలిపారు.. ఏ రోజు టోకెన్లను ఆ రోజే ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. మంగళ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లు ఇస్తామన్నారు. మిగిలిన రోజుల్లో 20 వేల నుంచి 25 వేల టోకెన్లు ఇస్తామన్నారు. టోకెన్లు తీసుకున్న భక్తులు క్యూ లైన్లో వేచి ఉండాల్సిన అవసరం ఉండదని తెలిపారు. టికెట్లు లేని భక్తులు వైకుంఠం ద్వారా స్వామి వారిని దర్శించుకోవాలని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
వీఐపీ బ్రేక్ దర్శన సమయం మార్పు: వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మార్పు చేయాలని నిర్ణయించామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని మారుస్తామన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామన్నారు. ఆన్లైన్లో శ్రీవాణి ట్రస్టు ద్వారా టికెట్లు పొందిన భక్తులకు తిరుపతిలో మాధవన్ అతిథి గృహంలో గదులను పొందేలా చర్యలు చేపట్టామన్నారు. తిరుమలలో పనిచేస్తున్న క్షురకులకు ఏదైనా సమస్యలుంటే అధికారులకు దృష్టికి తీసుకొని రావాలని, ఇలా ధర్నా చేయడం వల్ల సమస్యలు పరిష్కరం కాదన్నారు. దీనివల్ల చాలా భక్తులు ఇబ్బందులు పడ్డారని, దీనిపై పూర్తిస్థాయి నివేదిక రాగానే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
తిరుపతి అలిపిరి వద్ద తితిదే ఉద్యోగులకు 54 లక్షల రూపాయలతో నిర్మించిన ద్విచక్ర వాహనాల పార్కింగ్ కేంద్రాన్ని ఈవో ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తితిదే పాలక మండలి సభ్యుడు అశోక్ కుమార్, జేఈవో సదా భార్గవి పాల్గొన్నారు.
ఇవీ చదవండి: