TIRUMALA : తిరుమల శ్రీవారిని గాన సరస్వతి, మెలోడి క్వీన్ పి. సుశీల దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేసిన అనంతరం.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
RAINS IN TIRUPATI : తిరుమలలో చిరుజల్లులు కురిశాయి. రాత్రి నుంచి ఉదయం వరకు చిన్నపాటి వర్షం పడుతూనే ఉంది. దీనివల్ల భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం బయటికి వచ్చినవారు వర్షంలో తడుస్తూ గదులకు వెళ్లాల్సి వచ్చింది. వాతావరణం బాగా చల్లబడటంతో పిల్లలు, వృద్ధులు అసౌకర్యానికి గురయ్యారు.
ఇవీ చదవండి: