ETV Bharat / state

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు.. కాస్త జాగ్రత్త మిత్రమా..! - కడప జిల్లాలోని రోడ్డు ప్రమాదాలు

Road Accidents in the State: వాహనం తీసుకొని బయటకు వెళ్లేటప్పుడు.. మనం కోసం ఎదురుచూసే వారు నిత్యం మనసులో ఉండాలి. ఒక్కొక్కసారి మనం జాగ్రత్తగా ఉన్నా సరే.. ప్రమాదాలు జరగచ్చు. అలాంటప్పుడు అప్రమత్తంగా ఉంటే వాటి నుంచి కొన్నిసార్లు బయటపడచ్చు. తాజాగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో జరిగిన ప్రమాదాలు మనకు చెబుతున్న పాఠాలు ఇవి.

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు
Road Accidents in the State
author img

By

Published : Feb 12, 2023, 11:32 AM IST

Updated : Feb 12, 2023, 1:29 PM IST

Road Accidents in the State: రోడ్డు ప్రమాదంలో ఏదైనా అయితే.. అది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా.. కొన్ని కుటుంబాలను తీవ్రంగా కలచివేస్తుంది. అందుకే నిత్యం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. రెప్పపాటు కాలంలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో జరిగిన ప్రమాదాలు.. వాహనం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తున్నాయి.

ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట మండల పరిధి అడ్డరోడ్డు వద్ద కారును ఊక లారీ ఢీకొంది. తెనాలిలో పెళ్లికి వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విస్సన్నపేటకు చెందిన కారు యజమాని గుప్తా లాలుతో పాటు కారులో ప్రయాణిస్తున్న సంక సునీత మృతి చెందగా, సునీత భర్త రాంబాబు పరిస్థితి విషమంగా ఉంది. అంబులెన్స్​లో క్షతగాత్రుడు రాంబాబును విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విశాఖ జ్ఞానాపురంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం కేజీహెచ్​కు తరలించారు. మృతులు పట్టాభిరెడ్డి తోటకు చెందిన దినేష్ కుమార్ (27), పాత అడివివరం సింహాచలంకు చెందిన టి.రామానాయుడు (21) గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించిన కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

తిరుపతి జిల్లాలో చంద్రగిరి మండలంలోని పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై కారు కల్వర్టును ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందిలో.. ఏడుగురికి తీవ్రగాయాలు కాగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రెండు అంబులెన్స్​లలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

వైఎస్‌ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ, కారు ఢీకొని ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహబూబ్‌నగర్‌ వాసులుగా గుర్తించారు. మహబూబ్‌నగర్‌ నుంచి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది

కోణార్క్ నుంచి పూరీకి వస్తున్న చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన వ్యక్తులకు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్లంతా ఆటోలో వస్తున్న సమయంలో.. వేరొక బైక్ టైర్ ఒక్కసారిగా పేలింది. దీంతో బైక్ అదుపుతప్పడంతో.. ఆటో, బైక్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళతో పాటు ఆటో డ్రైవర్ రాజేష్ మృతి చెందారు. వెంటనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు క్షతగాత్రులను.. పూరీలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో ఓ ముగ్గురిని కటక్​కు తరలించారు. ప్రస్తుతం 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో కారు కోణార్క్​కు వెళ్తున్నట్టు సమాచారం.

ఇవీ చదవండి:

Last Updated : Feb 12, 2023, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.