RATHOTSAVAM: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం వైభవంగా సాగింది. మేరుపర్వతం వంటి రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు ఆశీసులై భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు.. తేరుపగ్గాలను పట్టుకొని రథాన్ని ముందుకు కదిలించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఈ రాత్రి ఏడూ గంటలకు జరిగే అశ్వవాహనంతో వాహన సేవలు ముగుస్తాయి.
రథోత్సవం : ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీన్నివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుందని భక్తుల నమ్మకం.
ఇవీ చదవండి: