PSLV C54 SUCCESS : తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ)-సి54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ-54 రాకెట్ ద్వారా 9 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించారు. ఈవోఎస్ శాట్-6 సహా 8 నానో ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-54 నిర్దేశిత కక్ష్యలోకి మోసుకెళ్లింది. ఓషన్ శాట్ ఉపగ్రహాల ద్వారా భూవాతావరణం పరిశీలన, తుపానులను పసిగట్టడం, వాతావరణంలో తేమ అంచనా, సముద్రాల మీద వాతావరణంపై అధ్యయనం చేయనున్నారు. ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.
పీఎస్‌ఎల్‌వీ--సి54 వాహకనౌక ద్వారా బెంగళూరు స్టార్టప్‌నకు చెందిన హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇది మీథేన్ లీకులు, భూగర్భ చమురు, పంటలకొచ్చే తెగుళ్లను గుర్తించేందుకు దోహదపడుతుంది. దీనికి ఆనంద్ అని నామకరణం చేశారు. ఈ ఉపగ్రహం బరువు 15 కిలోలు.
ఇవీ చదవండి: