ETV Bharat / state

Operation Chirutha in Tirumala: తిరుపతిలో 'ఆపరేషన్​ చిరుత'.. మిగిలిన వాటి కోసం అన్వేషణ

Operation Chirutha in Tirumala: తిరుమల కాలి బాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం, అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. వారం రోజుల వ్యవధిలో అలిపిరి కాలినడక మార్గంలో రెండు చిరుతలను అటవీ అధికారులు బంధించారు.

Operation_Chirutha
Operation_Chirutha
author img

By

Published : Aug 17, 2023, 5:18 PM IST

Updated : Aug 17, 2023, 10:57 PM IST

Operation Chirutha in Tirumala: తిరుపతిలో 'ఆపరేషన్​ చిరుత'.. మిగిలిన వాటి కోసం అన్వేషణ

Operation Chirutha in Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అలిపిరి కాలినడక మార్గాల్లో వచ్చే భక్తులకు భద్రత కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ చిరుత మరి కొన్నిరోజుల పాటు కొనసాగనుంది. భక్తులపై దాడి చేస్తున్న చిరుతలను బంధించేలా ఐదు బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. వారం రోజుల్లో రెండు చిరుతలను బంధించారు. ఆగస్టు 14న ఒకటి చిక్కగా.. గురువారం అర్ధరాత్రి(ఆగస్టు 17) ఒకటిన్నర గంటల సమయంలో లక్ష్మీ నరసింహ ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో మరో చిరుత బోనులో చిక్కింది. చిరుతల సంచారం కోసం దాదాపు 300 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. ఐదు ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసి మిగిలిన వాటిని బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. చిరుతలు చిక్కడంతో భక్తులకు కాస్తా ఊరట లభించిందనే చెప్పాలి.

Another Leopard Trapped in Cage at Tirupati: తిరుమల నడకదారిలో బోనులో చిక్కిన మరో చిరుత..

TTD Actions on Attack on Devotees: అలాగే కాలినడక మార్గంలో వచ్చే భక్తుల భద్రతలో భాగంగా చిరుతలను బంధించడంతో పాటు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఏడో నెంబర్ మైలు నుంచి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం వరకు భక్తులను బృందాలుగా పంపుతున్నారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 12 సంవత్సరాలలోపు పిల్లలున్న కుటుంబాలను కాలి నడక మార్గంలో అనుమతించడం లేదు. వీటితో పాటు అటవీ శాఖ ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు మేరకు కాలిబాటలో భక్తులకు రక్షణ కల్పించేందుకు కర్రలు పంపిణీ చేస్తున్నారు.

Leopard Trapped in Cage at Tirumala: తిరుమలలో బోనులో చిక్కిన చిరుత.. మరో ఐదు సంచారం..

TTD Chairman Reacts on Trolls: కర్రల పంపిణీ నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న విమర్శలను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఖండించారు. కాలిబాటలో వచ్చే భక్తులు ప్రశాంతంగా తిరుమల చేరుకోవడానికి తగిన రీతిలో చర్యలు చేపట్టామని ఛైర్మన్ వివరించారు. నడక మార్గాల్లో భక్తులపై చిరుత దాడుల తర్వాత వరుసగా చిరుతలను బంధించామన్నారు.

ఇప్పటికే చిరుతల సంచారం కోసం 300 కెమెరాలు ఏర్పాటు చేశామని తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మరో రెండు వందల కెమెరాలను చిరుతలు, ఎలుగు బంట్ల సంచారంపై నిఘా కోసం అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఎలుగు బంట్ల సంచారం కూడా ఉందని.. వాటి ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నామని తెలిపారు.

Girl killed in Leopard Attack: తిరుమల నడకదారిలో తీవ్ర విషాదం.. చిన్నారి ప్రాణాన్ని బలిగొన్న చిరుత

ప్రసుత్తం బోనులో చిక్కుకున్న చిరుతను కూడా ఎస్వీ జూపార్కుకు తరలిస్తున్నామని, బాలిక లక్షితపై దాడి పాల్పడిన చిరుతను గుర్తించేందుకు పరీక్షల అనంతరం నిర్ధారణకు వస్తామని అటవీ శాఖ సీసీఎఫ్​ నాగేశ్వరరావు అన్నారు. లక్ష్మీ నరసింహ ఆలయం అటవీ ప్రాంతంలో ఎలుగు బంటి సంచార జాడలను తెలుసుకునేందుకు మూడు బృందాలను నియమించామన్నారు. చిరుతలను బంధిండానికి మరో ఆరు బోన్లు తెప్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పట్టుబడిన చిరుతలు.. భక్తులపై దాడి చేసినవా లేక ఇతరవా అన్న అంశంపై పరీక్షలు నిర్వహిస్తున్నామని అటవీ అధికారులు తెలిపారు.

Animals Attack on Devotees in Tirupati: వెంకన్న దర్శనం.. అధికారుల నిర్లక్ష్యం.. భక్తులకు ప్రాణసంకటం..!

Last Updated : Aug 17, 2023, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.