ETV Bharat / state

ఇదేందయ్యా ఇది.. కారుకు అడ్డంగా పశువులొచ్చాయని ఫైన్ వేసిన కలెక్టర్ - ములుగు జిల్లా కలెక్టర్ వివాదం

Mulugu Collector fines Cattle shepherd : తెలంగాణలోని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య తీరు వివాదాస్పదమైంది. తన వాహనానికి పాడి పశువులు అడ్డురావడంతో కాపలాదారుపై కన్నెర్ర చేశారు. అంతటితో ఆగకుండా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. హరితహారంలో నాటిన మొక్కలను పశువులు నాశనం చేస్తున్నాయని కారణం చూపుతూ వారు కాపలాదారుకు రూ.7,500 జరిమానా విధించారు.

Mulugu Collector fines Cattle shepherd
Mulugu Collector fines Cattle shepherd
author img

By

Published : Jan 4, 2023, 2:49 PM IST

Mulugu Collector fines Cattle shepherd : వాహనానికి పశువులు అడ్డొచ్చాయని పశువుల కాపరిపై తెలంగాణలోని ములుగు జిల్లా కలెక్టర్‌ కన్నెర్ర చేశారు. కింది స్థాయి అధికారులను పిలిచి చర్యలు తీసుకోమని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు ఆ పశువులకాపరిపై చర్యలకు ఉపక్రమించారు. ఏకంగా అతడి పశువులు హరితహారంలో నాటిన మొక్కలను నాశనం చేస్తున్నాయనే నెపంతో రూ.7,500 జరిమానా విధించారు. లేదంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. చేసేదేం లేక భయంతో ఆ కాపరి జరిమానా చెల్లించాడు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.

ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన బోయిని యాకయ్య రైతుల పాడి గేదేలను అడవికి తీసుకెళ్లే క్రమంలో కలెక్టర్‌ వాహనానికి అడ్డుగా వచ్చాయి. హారన్‌ కొట్టినా పట్టించుకోకుండా యాకయ్య ఫోన్‌ మాట్లాడటంలో బిజీ అయ్యాడు. ఇది చూసి చిర్రెత్తిన కలెక్టర్.. యాకయ్యపై ఫైర్ అయ్యారు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు యాకయ్య పశువులు హరితహారంలో నాటిన మొక్కలు మేస్తున్నాయనే నెపంతో జరిమానా విధించారు. కలెక్టర్, అధికారుల తీరుపై పలువురు పశువుల కాపర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరుకు నిరసనగా మంగపేట ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.