Suicide: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో విషాదం నెలకొంది. జేకే టవర్స్‌లో నివాసముంటున్న కల్యాణి(26), తన బిడ్డతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. కల్యాణికి చెన్నైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మునిశేఖర్‌తో ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమారుడు ముని మేధన్ష్(5) ఉన్నాడు. అయితే భార్యాభర్తల మధ్య రెండేళ్లుగా వివాదం నడుస్తుండటంతో.. కల్యాణి శ్రీకాళహస్తిలో తన పుట్టింట్లో ఉంటుంది. శనివారం బిడ్డకు నిద్రమాత్రలు మింగించి.. తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: