Michaung cyclone in titupati : మిగ్‌జాం తుపాను ప్రభావంతో తిరుమలలో జోరు వానలు కురుస్తున్నాయి. పాతం కొండపై సోమవారం ఒక్క రోజే 100 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది. దీంతో జలాశయాలన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. అర్ధరాత్రి గోగర్భం, పాపవినాశనం జలాశయాలల్లో నీరు ఓవర్ ఫ్లో కావడంతో అధికారులు గేటును ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పసుపు ధార, కుమార ధార, ఆకాశగంగ జలాశయాలు పూర్తి స్థాయిలో నిండి అవుట్ ఫ్లో అవుతున్నాయి. భారీ ఈదురుగాలులకు పాంచజన్యం అతిధి గృహం వద్ద భారీ వృక్షం నేలకొరిగింది.దీంతో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. బాలాజీ నగర్ లోని ఓ చెట్టు ఇంటిపై పడింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సహాయక సిబ్బంది చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు.
తుపాను కారణంగా విశాఖ నుంచి 23 ఇండిగో విమానాలు రద్దు: ఎయిర్‌పోర్టు డైరెక్టర్
Michaung cyclone affected districts in tirupati : వర్షం ధాటికి కొండపై భక్తులు తీవ్ర ఇబ్బందు పడ్డారు. చలి తీవ్రత పెరిగిపోవడంతో భక్తులు విశ్రాంతి గదుల నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్ధితి ఎదురైంది. అర్ధరాత్రి గోగర్భం పాపవినాశనం జలాశయాలల్లో నీరు ఓవర్ ఫ్లో కావడంతో తితిదే నీటి పారుదల శాఖ ఒక్కొక గేటును ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. పసుపు ధార, కుమార ధార, ఆకాశగంగ జలాశయాలు పూర్తి స్ధాయిలో నిండి అవుట్ ఫ్లో అవుతున్నాయి.
మిగ్‌జాం తుపాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు-వేల ఎకరాల్లో నేలకొరిగిన వరి
about Michaung Cyclone Updates : తుపాను కారణంగా తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా జనాలు ఇంటి దగ్గరే ఉండాల్సిన పరిస్థుతులు నెలకొన్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ప్రజలు మిగ్‌జాం దాటికి దర్శనాలు కూడా చేసుకోలేకపోతున్నారు. తీవ్రమైన ఈదురు గాలులతో ముసుతున్న వానకు చలి విజృంభిస్తుంది. రోడ్లపై ఉన్న చిన్న గుంతలు సహా జలాశయాలు సైతం నీటితో నిండి ఉన్నాయి.
ఉత్తర దిశగా కదులుతున్న తీవ్రతుపాను - కొంతభాగం సముద్రంలో ఉన్నట్లు ఐఎండీ వెల్లడి
cyclone Michaung : ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. హెల్ప్లైన్ల ద్వారా సమాచారం అందించాలని సూచించారు.