Minister Kottu Satyanarayana: రాష్ట్రంలో దేవాదాయ శాఖ అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు బోర్డును ఏర్పాటు చేస్తూ జీఓ 43 ను జారీ చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. తమ శాఖ పరిధిలోని అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమార్థం సంక్షేమ నిధి ట్రస్టు బోర్డును ఏర్పాటు చేశామన్నారు. జీఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరించే ఈ బోర్డులో నలుగురు అధికారులు, ముగ్గురు అనధికారులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. దేవాదాయ శాఖ కమిషనర్.. సెక్రటరీ, ట్రెజరర్‌గా వ్యవహరించనున్నట్లు కొట్టు తెలిపారు. రాష్ట్ర ధార్మిక పరిషత్ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆగమ సలహా బోర్డుకు చైర్మన్‌తోపాటు.. 12 ఆగమాలకు సంబంధించి 12 మంది సభ్యులను నియమించినట్లు వెల్లడించారు.
సత్య శ్రీనివాస అయ్యంగార్ని బోర్డు చైర్మన్‌గా నియమించామన్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని పలు దేవాలయాలను రూ.249.26 కోట్ల సి.జి.ఎఫ్. నిధులతో అభివృద్ది పర్చేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోని దేవాలయాలను అభివృద్ది చేసేందుకు ఈ నిధులను వెచ్చిస్తున్నామని మంత్రి తెలిపారు. హిందూ మత ధర్మంపై విస్తృతమైన ప్రచారం కల్పించాలనే లక్ష్యంతో త్వరలో దేవాదాయ శాఖ ఆద్వర్యంలో పీఠాధిపతులు, మఠాధిపతుల విశిష్ట సదస్సును నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఇవీ చదవండి: